విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాకీవాలా చిత్రాలు ఆయన్ను ఎక్కడికో తీసుకు వెళ్లాయి.
ఇప్పుడు ఆయన తర్వాత సినిమా ఏమాత్రం తగ్గినా కూడా ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ పడుతారు.అందుకే డియర్ కామ్రేడ్ విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు.
భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మే 31న ఈ చిత్రంను విడుదల చేయాలని భావిస్తున్నారు.
అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రీ షూట్ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇటీవల హైదరాబాద్‌లో చేసిన 60 రోజుల షూటింగ్ రషెష్ చూసిన విజయ్ దేవరకొండ పెదవి విరిచినట్లుగా తెలుస్తోంది, రషెష్ ఎడిట్ చూసిన విజయ్ దేవరకొండ ఇలా వర్కౌట్ కాదని దర్శకుడు మరియు నిర్మాతలకు చెప్పాడట.
దాంతో దర్శక నిర్మాతలు ఆలోచనల్లో పడ్డారు.మళ్లీ రీ షూట్‌కు వెళ్లాలని భావిస్తున్నారు.60 రోజుల షూట్‌ను మళ్లీ రీ షూట్ చేయాలి అంటే మామూలు విషయం కాదు.అందుకే అందులో కాస్త తగ్గింది.30 నుండి 40 రోజుల్లో షూట్‌ను ఫినీష్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదే కనుక నిజం అయితే మే 31న సినిమా రావడం అనేది అసంభవం.
ఇలా అయితే విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి దేవరకొండ ఇన్వాల్వ్ మెంట్‌తో సినిమా బాగా వస్తే పర్వాలేదు, కాని బాగుండకుండా, ఆలస్యం అయితే మాత్రం ఖచ్చితంగా కొండకు కాస్త ఇబ్బంది తప్పదు.
ఈ చిత్రం తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మనోడు సినిమా చేయాల్సి ఉంది.దానిపై కూడా పెద్దగా నమ్మకం లేదు.కనుక విజయ్ దేవరకొండ ఆచి తూచి అడుగు వేస్తూ, రీ షూట్‌లు చెబుతున్నాడని అనుకుంటున్నారు.