ఆమె కార్ స్టీరింగ్ పట్టుకుంది, పక్కసీట్లో కార్ నేర్పే వ్యక్తి.! ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది అంటే.?

ఎదురుగా హైస్పీడ్ తో బస్ దూసుకువస్తుంది.చావడానికే సిద్దమైన ఓ యువతి బస్ కు ఎదురుగా నిల్చుంది.

 Indias First Cab Driver Selvi Life Story-TeluguStop.com

మరికాసేపట్లో తన చావు ఖాయం.చచ్చాక అయినా ప్రశాంతంగా ఉండొచ్చని మనుసులో అనుకుంటుంది ఆ యువతి.

ఆ సమయంలో ఆమెలోని అంతరాత్మ… చచ్చి నువ్వు సాధించేదేంటి? బతికి నిన్ను నువ్వు నిరూపించుకోమని హితవు పలికింది.వెంటనే సూసైడ్ చేసుకోవాలనే తన ఆలోచనను విరమించుకొని ఆ బస్ కు చేయి అడ్డు పెట్టి , బస్సు ఆపి, ఎక్కి, టికెట్ తీసుకొని బస్ లో కూర్చుంది.

ఆ యువతి పేరు సెల్వి కర్ణాటకకు చెందినామె, 14 యేళ్ళ వయస్సులోనే ఆమె తల్లీదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసారు.అసలే చిన్న పిల్ల, తాగొచ్చి కొట్టే భర్త, చిటికీ మాటికి అత్తగారి వేధింపులు.

దానికి తోడు ఆడబిడ్డల టార్చర్.అధనపు కట్నం ఎక్కడా? అంటూ భర్త, అత్త కొట్టే దెబ్బలకు ఆమె ఒళ్ళు హూనం అయ్యేది.వీటిని భరించడం కంటే , చావే శరణ్యం అనుకొని ఆ నిర్ణయం తీసుకుంది సెల్వీ.

బస్ లాస్ట్ స్టాప్ లోకి వచ్చి ఆగింది.ఒంటి మీద బట్టలు తప్ప మరేమీ ఆమె దగ్గర లేవు, కానీ బతకాలి, నేనేంటో నిరూపించాలి అనే ఆత్మస్థైర్యం మాత్రం గుండెలనిండా ఉంది.మొదట ఓ హోటల్ లో పనికి చేరింది.

కానీ ఒంటరి ఆడమనిషి అంటే చాలు కళ్ళతోనే రేప్ చేసేలా చూసే కళ్ళున్న సమాజం కదా.మొదట్లో ఆమెకు చాలా భయమేసింది.ఎవరు ఏ అఘాయిత్యానికి ఒడిగడతారోనని.అయినా తన అంతరాత్మకు ఇచ్చిన మాట కోసం గుండెల నిండా ధైర్యం నింపుకుంది.

ఓ రోజు పనిలోకి వచ్చేటప్పుడు, ఓ ఉన్నింటి ఆమె దర్జాగా బెంజ్ కారు నడుపుకుంటూ కనిపించింది సెల్వీకి.అమ్మో ఆడోళ్ళు కార్లు కూడా నడుపుతారా? అంటూ ఆశ్చర్యపోయింది.అదే సంగతి తనతో పాటు పనిచేస్తున్న మరొకరికి చెప్పింది.ఇదేముంది.ఇక్కడ కార్ డ్రైవింగ్ స్కూల్ ఉంది, ఉదయం అక్కడ చూడు ఎంతమంది మహిళలు కార్ నేర్చుకోడానికి వస్తారో అంది సెల్వీతో పాటు పనిచేసే మరో మహిళ.

ఆమె చెప్పినట్టే సెల్వీ ఆ డ్రైవింగ్ స్కూల్ కు వెళ్ళింది.

వచ్చీపోయే వాళ్ళతో బిజీబిజీగా ఉంది ఆ డ్రైవింగ్ స్కూల్.వాళ్ళందరినీ చూస్తూ నిల్చుంది సెల్వీ.సెల్వీని గమనించిన ఒక వ్యక్తి ఏం కావాలి ? అని అడిగాడు.నేనూ….కార్ నేర్చుకోవానుకుంటున్న అని చెప్పింది సెల్వీ.సరే ఫీజు 5000 అన్నాడు.తను దాచుకున్న డబ్బులు చెల్లించి…మరుసటి రోజు కార్ స్టీరింగ్ పట్టుకుంది సెల్వీ.పక్కసీట్లో కార్ నేర్పే వ్యక్తి.

కార్ మెల్లిగా మూవ్ అవుతుంది…… 1,2,3,4,5,6,7……………………….

సరిగ్గా వారం తర్వాత.సెల్వీ ఒక్కతే కార్ ను పరుగులు పెట్టిస్తుంది.టాప్ గేర్, రివర్స్ గేర్… అన్ని గేర్లలో కార్ డ్రైవింగ్ ను ఆటాడుకుంటుంది.

కట్ చేస్తే ఆమే… కర్ణాటక లో తొలి మహిళా టాక్సీ డ్రైవర్.తొలి మహిళా లారీ డ్రైవర్, తొలి మహిళా ట్రక్ డ్రైవర్.

ఆమెకు ఎన్నో అవార్డులు.ఆమెపై ఎన్నో పేపర్ కథనాలు.

ఇప్పుడు ఆమె అంతరాత్మ ఆమెతో చెబుతుంది,,,నువ్వు సాధించావ్ సెల్వీ! నువ్వు సాధించావ్!!

కొత్త జీవితాన్ని ప్రారంభించిన సెల్వీ, ఇంకొకరిని ఇష్టపూర్తిగా వివాహం చేసుకుంది.ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు, వారి భవిష్యత్ కు చక్కటి ప్రణాళికలు ఇప్పటి నుండే వేస్తుంది తల్లి సెల్వీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube