‘ఎన్టీఆర్‌’ విషయంలోనే ఇది జరుగుతుంది.. ఇండియాలోనే మొదటిసారి

గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతుంది.ఎన్టీఆర్‌ చిత్రంను రెండు పార్ట్‌లుగా తీస్తేనే తప్ప పూర్తిగా ప్రేక్షకుల ముందు చరిత్రను ఉంచగలమని నమ్మిన దర్శకుడు క్రిష్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.

 Ntr Biopic Movie Two Parts Release In Two Weeks Gap Only-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం రెండు పార్ట్‌లను కేవలం రెండు వారాల గ్యాప్‌లోనే విడుదల చేయబోతున్నారు.ఇలా ఒక సినిమాకు సంబంధించిన రెండు పార్ట్‌లు కేవలం రెండు వారాల్లోనే రావడం అరుదుగా చెప్పుకోవాలి.

గతంలో పలు సినిమాలు రెండు పార్ట్‌లు, అంతకు మించిన పార్ట్‌లుగా వచ్చాయి.కాని అవేవి కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ రాలేదు.ఇప్పటి వరకు ఇండియాలో రెండు మూడు పార్ట్‌లుగా వచ్చిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో రాలేదని, ఇది కేవలం ఎన్టీఆర్‌ చిత్రం విషయంలోనే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.తెలుగు రాష్ట్రాలతో పాటు పలు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాత మరియు దర్శకుడు ఉన్నారు.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌ చిత్రం మొదటి పార్ట్‌కు ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఇక రెండవ పార్ట్‌కు ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ అనే టైటిల్‌ను ప్రకటించారు.కథనాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక మహానాయకుడు చిత్రం అదే నెల రిపబ్లిక్‌ డే సందర్బంగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మొత్తానికి ఎన్టీఆర్‌ చిత్రం ఒక సంచలనం కాబోతుంది.బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

రెండు పార్ట్‌లు కలిసి సునాయాసంగా 100 కోట్లు రాబట్టడం ఈజీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube