4గంటల్లో 2కిలోల బరువు తగ్గిన మేరీ కోమ్...బరువు తగ్గింది స్వర్ణం దక్కించుకుంది..

నాలుగు గంటల్లో రెండు కిలోల బరువు తగ్గడం సాధ్యామేనా… ఖచ్చితంగా సాధ్యమే.ఏంటి తమాషాలు చేస్తున్నా.

 Mary Kom Lost 2 Kilos In Just 4 Hours By Skipping Rope-TeluguStop.com

గంటలు గంటలు వ్యాయామం చేసినా ఒంట్లో పేరుకున్న కొవ్వును ఇసుమంతైనా కరిగించలేకపోతున్నాం.నాలుగు గంటల్లో రెండు కిలోలు తగ్గడం గురించి చెప్తున్నా.

వినడానికి మేం తప్ప నీకెవరూ దొరకలేదా అనుకుంటున్నారా.కానీ నిజం.

మన బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ తెలుసు కదా.తాను స్వయంగా తగ్గి చూపించింది.కాకపోతే ఇదేదో ఛాలెంజ్లో భాగంగా తగ్గిన బరువు కాదు.మరెందుకని.ఎందుకో తెలుసుకోవాలంటే చదవాల్సిందే.

భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ గొప్పతనం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది.ఒకసారి బాక్సింగ్ బరిలోకి దిగితే తనకి సాటెవరు లేరు అన్నట్టుగా అనిపించేది.

అయితే ఈ సారి బాక్సింగ్ బరిలోకి దిగడానికి ముందే తనకి అడ్డంకి ఏర్పడింది.అది తన బరువు రూపంలో.పోలెండ్‌లో ఇటీవలే ముగిసిన బాక్సింగ్‌ టోర్నీ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.48కేజీల విభాగంలో పాల్గొనడానికి వెళ్లిన మేరీకోమ్ బరువు అక్కడికి వెళ్లేసరికి 50 కిలోలు ఉంది.పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్‌ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉంది.అప్పుడు ఎలా అని బాధపడకుండా.ఏమాత్రం కంగారు లేకుండా వెంటనే బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది.కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది.

బరువు గురించి తెలిసిన వెంటనే స్కిప్పింగ్‌ స్టార్ట్ చేసింది.ఏకబిగిన రెండుగంటలపాటు ఆపకుండా స్కిప్పింగ్ చేసింది.ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది.వేయింగ్‌ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది.అనంతరం తన పంచ్‌ పవర్‌తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది.‘బరువు తగ్గకపోతే పోటీ చేయడానికి అర్హత సాధించలేకపోయే దాన్ని.వెంటనే బరువు కోల్పోవడం కోసం గంట పాటు స్కిప్పింగ్‌, స్ట్రెచింగ్‌ చేశాను.జిమ్‌లో చాలాసేపు గడిపాను.నాలుగు గంటలు వ్యాయామం చేస్తూనే ఉన్నా.అనూహ్యంగా రెండు కేజీలు తగ్గాను.పోటీల్లో పాల్గొనగలిగాను.’ఒకవేళ వెయింగ్‌లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది.అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను.వేయింగ్‌ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను’ అని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube