అగ్రరాజ్యం అమెరికా అన్ని దేశాలపై ఆధిపత్యం చేస్తూ ఎదురు తిరిగిన దేశాలపై నియంతృత్వ వైఖరితో అనిచివేస్తూ అన్ని దేశాలని గడగడ లాడిస్తున్న తరుణంలో ఇప్పుడు అమెరికాని గడగడలాడిస్తోంది హరికేన్.అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన ‘హారికేన్ ఫ్లోరెన్స్’ తీవ్రత అమెరికాకి పెను ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ అధికార్లు వెల్లడించారు.
దాంతో వరుస వరుసగా ఏర్పడుతున్న ఈ హరికేన్లు అమెరికా ప్రజలని ఆందోళనకి గురించేస్తున్నాయి.
అమెరికా తూర్పు తీరంవైపు కేటగిరి 1 స్థాయి గల తుఫాను దూసుకొస్తోందని హరికేన్ సెంటర్ తెలిపింది.ఈ ప్రభావం సోమవారం నాటికి నార్త్ కరోలినా లేదా సౌత్ కరోలినాపై ప్రభావం చూపించవచ్చునని.గురువారం వరకూ ఈ ప్రభావం అదేవిధంగా కొనసాగుతూ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అంతేకాదు ఈ సమయంలో ఎవరూ బయటకి వెళ్లకూడదని ప్రకటించారు.
దాదాపు గంటకు 144 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశంతోపాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఈ పరిణామాల దృష్ట్యా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలనియా సురక్షితంగా ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ హారికేన్ ప్రభావం ముగిసిన అనంతరం మరో రెండు బలమైన హారికేన్లు ఏర్పడే అవకాశం ఉందని హరికేన్ సెంటర్ అధికార్లు తెలుపడంతో ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు.