భారతీయుల ప్రతిభ సామాన్యమైనది కాదు.అనితర సాధ్యమైనది…మొక్కవోని దీక్షతో ఎంతో ధృడమైన నమ్మకంతో ఉండగలిగే ఓర్పుతో ఉండగలిగే శక్తి భారతీయు సొంతమనే చెప్పాలి.
అందుకే భారతీయులు ఎక్కడ ఉన్నా సరే తమ ప్రతిభని చాటుకోగలరు, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలరు.అందుకే సత్య ఎస్.త్రిపాఠీ అనే భారత ఆర్ధిక వేత్తకి అరుదైన గౌరవం దక్కింది.వివరాలలోకి వెళ్తే.
భారత ఆర్థికవేత్త, ఐక్యరాజ్యసమితి అధికారి అయిన సత్య ఎస్.త్రిపాఠీని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)లో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దాంతోపాటు ఆయన న్యూయార్క్ కార్యాలయ అధినేతగా కూడా ఉంటారు…ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరరెస్ నియామక ఉత్తర్వులు వెలువరించారు.2017 నుంచి త్రిపాఠీ యూఎన్‌ఈపీలో 2030 ఎజెండా ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో సీనియర్ సలహాదారుగా పని చేశారు.
ఆర్ధిక వేత్తగా మాత్రమే కాదు న్యాయవాదిగాను 35ఏళ్ల అనుభవం ఉన్న త్రిపాఠీ 1998 నుంచి ఐక్యరాజ్యసమితిలో యూరప్, ఆసియా,ఆఫ్రికా ఖండాలలో పనిచేశారు…అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో అడవుల నరికివేత వల్ల వెలువడే ఉద్గారాల తగ్గింపు.అడవుల క్షీణత లాంటి అంశాలకు సంబంధించి ఐరాసలో డైరెక్టర్‌గాను, ఎగ్జిక్యూటివ్ అధినేతగాను పనిచేశారు…పర్యావరణం పై ప్రత్యేక శ్రద్ద చూపించే త్రిపాటి కి ఈ పదవి దక్కడం ఎంతో సంతోషమని భారతీయులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.