సమాజంలో భాద్యతగా ఉండాల్సిన పెద్దలు గాడి తప్పుతున్నారు.ఇంటికి పెద్ద అయిన తండ్రి భాద్యతలు మరిచిపోయి `తాగుడికి బానిసగా మారిపోతే ఇంట్లో చేతికి అందిన కొడుకులు తలో దారి వెళ్ళిపోయి కుటుంభాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ ఇంటి ఆలనా పాలనా చూసేది ఎవరు.? బయటకి వెళ్ళడం అలవాటు లేని ఆ ఇంట్లో ఆడవారి పరిస్థితి ఏమిటి వారి ఆకలి ఎలా తీరుతుంది.ఇలాంటి సంఘటన ఎదుర్కొన్న ఒక యువతి ఆకలికి ఆగలేక ఆత్మహత్య చేసుకుంది.
వివరాలలోకి వెళ్తే…
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కుటుంభానికి చెందినా యువతి ఆకలికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మరణించింది.అయితే ఆ యువతి చావుకి కారణం అయిన తన తండ్రి అన్నలే అంటూ లెటర్ రాసి మరీ బలవన్మరణం కి పాల్పడింది.
ఇలాంటి అన్నదమ్ములు , తండ్రి ఎవరికీ ఉండకూడదు అంటూ ఆ లేఖలో రాసింది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృత దేహాన్ని పరిశీలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
అయితే విచారణ నిమిత్తం పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించగా దిమ్మతిరిగే నిజాలు బయట పడ్డాయి.
మృతురాలి తండ్రిపేరు నెక్ రామ్.అతను కుటుంబంతో సహా గత 30 ఏళ్లుగా ఆగ్రాలో ఉంటున్నాడు.బోరింగ్, హ్యాండ్ పంప్స్ పనులు చేస్తూ డబ్బుని బాగానే సంపాదిస్తూ ఉంటాడు.
అయితే అతని మద్యం అలవాటు కారణంగా కుటుంబాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు…పిల్లలని పట్టించుకున్న పాపాన లేదని చుట్టుపక్కల వారు నిప్పులు చెరుగుతున్నారు.ఏదన్న సాయం అవసరం అంటే కనీసం అడగను కూడా అడిగేవారు కాదని అంటున్నారు.
ఎంతో పద్దతిగా అతడి కుమార్తె ఉండేదని ఇంట్లో నుంచీ బయటకి కూడా వచ్చేవారు కాదని తెలిపారు.అయితే
ఆ కిరాతక తండ్రికి ఇద్దరు కుమారులు నలుగురు నలుగురు కుమార్తెలు ఉన్నారు.
వీరిలో ఇద్దరు కొడుకులకు, ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది.దీంతో ఇంట్లో నెక్‌రామ్, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు ఉంటున్నారు.
అయితే కొద్దిరోజులుగా ఇంట్లో నిత్యావసర సరుకులు లేవు.దీంతో ఆకలిని భరించలేక ఆమె ఏమి చేయాలో తెలియక ఎవరిని అడగలేక ఆత్మహత్యకి పాల్పడిందని తెలుస్తోంది అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.
.