ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను చేసుకుంటూ వస్తున్నాడు.కెరీర్ ఆరంభించినప్పటి నుండి భారీ చిత్రాలు చేస్తూ దూసుకు పోతున్న ఈ బెల్లంకొండ తాజాగా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.
స్టార్‌డం వచ్చిన తర్వాత లేదా స్టార్‌గా గుర్తింపు దక్కించుకుని కొంత కాలం స్టార్ ఇమేజ్‌ను అనుభవించిన తర్వాత ప్రయోగాు చేస్తారు.కాని బెల్లంకొండ మాత్రం ముందే ప్రయోగాలు కూడా చేసేస్తున్నాడు.
ప్రస్తుతం ‘సాక్ష్యం’ చిత్రంతో పాటు మరో చిత్రాన్ని చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో మరో చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యాడు.ఆ చిత్రంలో చాలా అమాయకపు పల్లెటూరు కుర్రాడిగా కనిపించబోతున్నాడు.ఆ పాత్ర కోసం బెల్లంకొండ శ్రీనివాస్ గతంలో వచ్చిన పలు పాత చిత్రాలను, పాత చిత్రంలోని పల్లెటూరు హీరోల పాత్రలను చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ పాత్ర స్వాతిముత్యంలోని కమల్ హాసన్ తరహాలో ఉంటుందనే టాక్ సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో వినిపిస్తుంది.
స్వాతిముత్యం చిత్రంలో కమల్ హాసన్ నట విశ్వరూపంను చూడవచ్చు.ఆ చిత్రంలో చాలా అమాయకపు పాత్రలో నటించి అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాడు.
జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును ఆ పాత్ర కమల్‌కు తెచ్చింది.అంతటి గొప్ప పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతుండటం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కనీసం పది సినిమాల వయస్సు కూడా లేని బెల్లంకొండ ఈ స్థాయి పాత్రను చేయడం అంటే దాదాపు అసాధ్యం అంటూ కొందరు ముందే చెప్పేస్తున్నారు.
కమల్ హాసన్ స్వాతిముత్యం పాత్రను బెల్లంకొండ పాత్రను పక్క పక్కన పెట్టి ప్రేక్షకులు చూస్తారు.
అలా చూసిన సమయంలో ఖచ్చితంగా బెల్లంకొండ ఫెయిల్ అవుతాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి కమల్ చేసిన పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఊహించుకోవడమే కష్టంగా ఉంది.
కొన్ని సీన్స్ వరకు అంటే పర్వాలేదు, కాని సినిమాలో ఎక్కువ శాతం స్వాతిముత్యం పాత్ర అయితే ఆడటం కష్టమే అంటూ ముందే విశ్లేషకులు అంటున్నారు.అయితే కమల్ హాసన్ పాత్రను గుర్తు చేయకుండా విభిన్నంగా, ఈతరం అమాయకపు కుర్రాడి పాత్రలో బెల్లంకొండ సురేష్‌ను చూపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అందరు కుర్రాలు ప్రేమలు, పబ్‌లు అని తిరుగుతుంటే ఒక కుర్రాడు మాత్రం అమాయకంగా ఉంటూ అందరితో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు.ఈ కథతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చిత్రం రెడీ అవుతుంది.
వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.మరి ఈచిత్రంతో బెల్లంకొండ అలరిస్తాడా లేదా అల్లరి పాలవుతాడా అనేది చూడాలి.