సృష్టిలో రక్త సంభందానికి ఉన్న విలువ మరే భంధానికి ఉండదు.ప్రపంచంలో ఎక్కడి మనుషులైనా సరే అన్నా చెల్లెళ్ళు.
తండ్రి కూతుళ్ళు ఇలా రక్త సంభందాలకి ఎంతో విలువ ఉంటుంది.అయితే సమాజంలో అభివృద్ధి, టెక్నాలజీ పెరుగుతుండటంతో పాటుగా మనుషుల మధ్య ఉన్న భందాలు సైతం కనుమరుగై పోతున్నాయి.
పిల్లలు ఎదిగే క్రమంలోనే వారికి తమ భందుత్వాల గురించి పెద్దలు చెప్తూ ఉండాలి.ఎలా లేని పక్షంలో పిల్లల వ్యవహార ధోరణి తీవ్ర రూపం దాల్చుతుంది.
ఇదే కోణంలో జరిగిన ఒక సంఘటన అందరిని విస్తు పోయేలా చేసింది…వివరాలలోకి వెళ్తే.
చెన్నై లో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ప్రేమించుకున్న ఘటన అందరిని ఆలోచనలో పడేసింది.చివరికి వారు ఆత్మహత చేసుకోవడంతో ఈ ఘటన అందరిలో భయాన్ని రేపుతోంది.ఇద్దరు మైనర్లు వరుసకి అన్నా చెల్లెళ్ళు అవుతారు.వీరిద్దరూ తమిళనాడులోని తిరుచ్చి తిల్లైనగర్‌కు చెందిన బాలుడు, బాలిక ఓ పాఠశాలలో ప్లస్‌వన్, పదో తరగతి చదువుతున్నారు.అయితే వారి పరిచయం ప్రేమగా మారింది ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఆవిషయం ఇంట్లో చెప్పగా ఇది తప్పని వారించి మందలించారు.
అయితే పెద్దల మందలింపు వారు ఎక్కడ విడిపోతారో అనే భయం తో ఎప్పటిలాగానే స్కూల్ కి వెళ్ళిన వారు
రైలుకింద పడి వారు ఆత్మహత్య చేసుకున్నారు.కుడియాకురిచ్చి సమీపంలోనున్న రైల్వేస్టేషన్ పట్టాల వద్దకు వారి ఇరువురి మృతదేహాలు దొరికాయి.
“మా ప్రేమను మీరు ఎప్పటికీ అర్థం చేసుకోరు.మేం చనిపోయి ఆ ప్రేమను కాపాడుకుంటాం”.
అంటూ వారు రాసిన ఆత్మహత్య లేక కలకలం సృష్టించింది.అయితే పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటోంది.
ఇతరులతో భందుత్వాలతో ఎలా ఉంటున్నారు అనే విషయాలు తల్లి తండ్రులు ఎప్పటికప్పుడు చూసుకోవాలి అంటున్నారు మానసిక నిపుణులు.