దేశానికి రెండు కళ్ళు గా భావించేది రైతులు , సైనికులు.రైతే రాజు , రైతే దేశానికి వెన్నుముక అంటూ చెప్తారు.
అలాగే రైతు కంట నీరు తెప్పించిన అనేక ప్రభుత్వాలు,పార్టీలు నెలమట్టం అయ్యాయి.దేశానికి రాజకీయ నాయకులు అవసరమో లేదో తెలియదు కాని , దేశంమొత్తం మీద రైతుల అవసరం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగం , ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి జీతాలు రాకున్నా , జీతాలు పెంచుకున్న రోడ్డెక్కి సమ్మె చేస్తారు , ఇలాంటి నిరసనలు ప్రభుత్వాలు దిగి రాక తప్పదు.వాళ్ల డిమాండ్లు పరిష్కరించక తప్పదు.
కానీ ఇలాంటి నిరసనలు ఏం చేయకుండా, ఎంత కష్టం వచ్చినా ఎండ అనేక వాన అనక, రాత్రి అనక పగలు అనక 24 గంటలు పనిచేసి పంట పండించి మనకి అన్నం పెడుతున్న అన్నదాతలను మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు.రైతులకు వ్యవసాయం చేసి అప్పులు చేసి ప్రభుత్వం సహాయం చేయక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్లందరికీ ఈ రైతు ఆదర్శం.
ఈయన వ్యవసాయం చేసి 70 రోజుల్లో 21 లక్షలు సంపాదించాడు, ఎలాగో చూడండి…
70 రోజుల్లో 21 లక్షల సంపాదన
గుజరాత్ లోని బనస్కాంత జిల్లా చండాజీ గోలియా అనే చిన్న గ్రామానికి చెందిన 41 ఏళ్ల ఖేటజీ సోలంకి అనే రైతు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నాడు.అతని తండ్రి బంగాళదుంప,వేరుశనగ పంటలను పండించేవాడు.
కానీ, వాటిల్లో పెద్దగా లాభం లేకపోవడంతో ఆ కుటుంబం నిరుపేదగానే మిగిలిపోతుంది.దీంతో ఏదైనా కొత్తగా చేయాలని భావించిన ఖేటజీ, బంగాళదుంప పంటకు గుడ్ బై చెప్పి ఈ ఏడాది వినూత్నంగా ఖర్భుజా పంటను వేసాడు.
ఈ పంట వేసేముందు దీనిగురించి ఎంతో రీసెర్చ్ చేశాడు.తనకున్న నాలుగు ఎకరాల భూమిలో ఖర్బుజ పంటను వేసి చరిత్ర సృష్టించాడు.
తనవద్దకే మార్కెట్ వాళ్లు వచ్చి కొనుగోలు చేసేలా వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇక మార్కెట్ రేటుకే తన పంటను అమ్మగా, నాలుగు ఎకరాల ఖర్బుజ పంటకు మొత్తం 21 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పాడు.దీనికి లక్షన్నర ఖర్చుకాగా,మొత్తం 19.50 లక్షల రూపాయల ఆదాయం కేవలం 70 రోజుల్లోనే వచ్చిందని ఖేటజీ తెలిపాడు.

70 రోజుల్లోనే పంట చేతికి వచ్చేందుకు తాను ఎంచుకున్న విత్తనాలు, ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ ఇవన్నీ కారణం అని చెప్పుకొచ్చాడు.సరైన సమయానికి సరైన పెస్టిసైడ్స్ వాడాల్సి ఉంటుందని తెలిపాడు.భూమి కూడా ఖర్బుజా పంటకు అనుకూలించిందని,ఈ పంట వేయడం ఇదే తొలిసారని, ఇక తన గ్రామమంతా లాభాల బాటలో పయనించేందుకు తన సహాయాన్ని అందిస్తానని ఖేటజీ చెప్తున్నాడు.ప్లాన్ ప్రకారం పంట వేస్తే లాభం తప్పకుండా వస్తుందని,భవిష్యత్తులో ఇంకా మంచి ఆదాయం వచ్చేలా తాను కొత్త పద్ధతులను కనుగొంటానని చెప్తున్నాడు.
అన్నదాతలు అప్పుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, వారిని కాపాడటమే తన లక్ష్యమని,అందుకు కొత్త కొత్త పద్ధతులు కనుగొని అందరికి ఆదాయం వచ్చేలా తన సూచనలు,సలహాలు ఇస్తానని చెప్తున్నాడు ఖేటజీ అనే రైతు.