మీ అదృష్ట సంఖ్య మూడు... అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా మూడో తారీఖున జన్మించిన వారి లక్షణాలు,గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.మూడో తారీఖు అంటే వీరి మీద గురు గ్రహం ఆధిపత్యం వహిస్తుంది.

 People Born On The 3rd Of Everymonth-TeluguStop.com

అందువల్ల వీరి జీవితంలో అధికంగా గురు గ్రహ ప్రభావం ఉంటుంది.అలాగే వయస్సుకు మించిన అనుభవాలు వీరి జీవితంలో ఉంటాయి.

వీరికి గురు గ్రహం అనుకూలంగా ఉండటం వలన పది మందికి సలహాలు ఇవ్వగలిగే స్థితిలో ఉంటారు.ఎన్ని కష్టాలు,ఇబ్బందులను ఎదుర్కొన్న మరల విజయాల బాటలోకి వచ్చేస్తారు.

వీరు ఇబ్బందులు,కష్టాలు ఎదురైనా భయపడకుండా ముందుకు సాగి విజయాలను అందుకుంటారు.అపజయం వస్తే కృంగిపోకుండా మరింత రాటుదేలతారు.వీరు ఏ రంగంలో ఉన్న పది మంది గుర్తించే స్థాయికి చేరుకుంటారు.మూడో తారీఖున జన్మించిన వారు గురువుగా బాగా సెట్ అవుతారు.

వీరికి పుట్టకతోనే తెలివితేటలు ఉంటాయి.అయితే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అనేది వీరి ప్రధాన సమస్య.

వీరు తమ తెలివితేటలను మంచి మార్గంలో పెడితే జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరతారు.అలాగే గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.అదే వీరు ఆ తెలివితేటలను చెడు కోసం ఉపయోగిస్తే ఇబ్బందులు వస్తాయి.ఆ ఇబ్బందుల నుండి బయట పడటం కూడా కష్టమే.వీరికి కళా రంగం మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది.వీరు మధ్య వయస్సుకు వచ్చాక మాత్రమే కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు.

చిన్న వయస్సులో కొంచెం కష్టపడినా మధ్య వయస్సుకు వచ్చే సరికి ఆర్ధికంగా కూడా సెటిల్ అవుతారు.వీరు కస్టపడి సంపాదించిన ప్రతిదీ వీరితోనే ఉంటుంది.వీరు అని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటారు.వీరు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు.

వీరు ఎక్కువగా ఊహ లోకంలో విహరిస్తూ ఉంటారు.వ్యాపారంలో లాభాలు వస్తాయని ఊహించే ముందుగానే ఖర్చవు పెట్టేస్తూ ఉంటారు.

ఆలా కాకుండా లాభాలు వచ్చాక ఖర్చు పెడితే మంచిది.

వీరు ఏదైనా పని చేసినప్పుడు ఫలితం వస్తుందని అనిపిస్తేనే అటు వైపు అడుగులు వేస్తారు.

ఏ మాత్రం అనుమానం ఉన్నా అటు వైపు అసలు వెళ్ళరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube