జూనియర్ ఎన్టీఆర్ కి పెళ్లి అయ్యి ఆరేళ్ళు అయ్యింది.ఇప్పటివరకూ ఇంటర్వూస్ లో కానీ, ఎక్కడైనా తన భార్య ప్రణతి గురించి ఒక్క మాట మాట్లాడాడు జూనియర్.
ఏదన్నా ఫంక్షన్స్ కి వస్తే తప్ప ఎప్పుడు పెద్దగా కనపడదు ప్రణతి.అయితే ఎన్టీఆర్ ఓ మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భార్య మీద ఆసక్తి కరమైన విషయాలు చెప్పాడు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ నాకు ఉన్న ఒక విచిత్రమైన అలవాటుకి నా భార్య సర్దుకు పోతూ వ్యవహరించే తీరుని వివరించగానే అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారట.ఎన్టీఆర్ కి ఎక్కడ వస్తువులు అక్కడ వాటి వాటి స్థానాలలో ఉండాలి, వాటిని వేరే చోట పెట్టకూడదు అనే అలవాటు ఉందట .దీనిని వైద్య శాస్త్రంలో (ఒబిసిసివ్ కంపల్సివ్ డిజార్డర్) అని అంటారు.ఉదాహరణకు జూనియర్ కు నిద్ర లేవగానే బ్రష్ చేసుకోవడానికి తన బాత్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాష్ బేసిన్ దగ్గర తన కుడి చేతి వైపు టూత్ బ్రష్ అలాగే ఎడమ చేతి వైపు టూత్ పేస్ట్ కరక్ట్ గా ఉండకపోతే జూనియర్ కు విపరీతమైన అసహనంగా మారుతుందట.
పెట్టిన వస్తువు పెట్టిన చోట లేకపోతే జూనియర్ కి తెగ కోపం వస్తుందట అందుకే ప్రణతి ముందుగానే లేచి అన్నీ సరిగా ఉన్నాయో లేదో అని జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్పాడు జూనియర్.అంతేకాదు తన ముద్దుల కొడుకు అభయ్ రామ్ గురించి కూడా చెప్తూ తెగ మురిసిపోయాడు జూనియర్.
ఇంతకముందు కంటే కూడా ఈ మధ్య తన కొడుకు తనతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడట.అంతేకాదు తనని ఆడిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడట.నేను రాగానే వాడు నా దగ్గరకి రావడానికి ట్రై చేస్తున్నాడు, నా తో ఆడుకుంటున్నాడు అంటున్నాడు.అభయ్ ని చూడకుండా ఒక్క రోజు కూడా తానూ ఉండలేక పోతున్నాను అని తండ్రి కొడుకుల రిలేషన్ గురించి కూడా చెప్పాడు జూనియర్.
ఎంత పెద్ద స్టార్ అయినా పిల్లల ప్రేమకి వాళ్ళ చిరునవ్వులకి ఫిదా అవ్వాల్సిందే.