టాలివుడ్ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు అయ్యేలా ఉంది.రెండోవరోజే ఊహించని మలుపులు తిరిగింది విచారణ.
మొన్న పూరి జగన్నాథ్ కి విచారించిన పోలీసులు, నిన్న కెమెరామెన్ శ్యాం కె నాయుడుని ప్రశ్నించారు.దాదాపు అయిదు గంటల పాటు 30కి పైగా ప్రశ్నలతో జల్లెడ పట్టారు.
అంతలోనే నోటి నుంచి ఎవరు ఊహించని విషయాలు బయటపడ్డాయి.పూరి జగన్నాథ్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందట.
ఇప్పుడు తీసుకుంటున్నారా లేదా అనే విషయం మీద క్లారిటి లేదు కాని, ఒకప్పుడు మాత్రం పూరి డ్రగ్స్ లో మునిగి తేలారట.కేవలం తానూ తీసుకోవడమే కాకుండా, ఇతరులకి కూడా అలవాటు చేయించారట.
పూరి పార్టనర్ చార్మీకి కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందట.
ఈ విషయాలు ఇంకెవరో చెబితే అనుమానం ఉండేది కాని చెప్పింది శ్యాం కె నాయుడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 17 సినిమాలకు ఆయనే కెమెరామెన్.హీరో అయినా దర్శకుడితో ఎప్పుడూ ఉండడు కాని కెమెరామెన్ ఎప్పుడు వెన్నంటే ఉంటాడు.
పూరి డ్రగ్స్ తీసుకుంటుండగా శ్యాం కె నాయుడు చాలాసార్లు తన కళ్ళతో చూసారట.తానూ తీసుకోవడంతో ఆగకుండా, ఇతరులకి అందించేవారట.
ఈ రేవ్ పార్టీలు, లేట్ నైట్ పార్టీలు అంటే పూరికి బాగా ఇష్టమని, ఆ పార్టీలకు వచ్చేవారు తన మీద ఇంప్రెషన్ పెంచుకోవాలని డ్రగ్స్ సరఫరా చేసేవారని శ్యాం కె నాయుడు విచారణలో తెలిపారట.
అయితే తనకు మాత్రం డ్రగ్స్ అలవాటు లేదని శ్యాం తెలిపారు.
పూరి నిర్వహించే పార్టీలకు కేవలం పెద్దవారితో పరిచయాలు పెంచుకునేందుకే వెళ్ళేవాడినని, తనకు కనీసం సిగరెట్ అలవాటు కూడా లేదని, సెట్ లో కూడా ఎవరైనా సిగరెట్ తాగితే ముక్కుకి గుడ్డ కప్పుకుంటానని చెప్పారు శ్యాం.పూరి సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి అధికారులు బయటపెట్టగా, అందులో పూరి పక్కనే ఉన్నారు శ్యాం.
ఆ ఫోటో గురించి వివరాలు అడగగా, పూరి సిగరెట్ రూపంలో కూడా డ్రగ్స్ తీసుకుంటారని, సిగరెట్ మత్తు కలుపుకొని తాగడం, లేదంటే డైరెక్ట్ గా పౌడర్ పీల్చడం పూరికి అలవాటు అని చెప్పారు ఈ సినిమాటోగ్రాఫర్.
రేవ్ పార్టీల్లో, సీక్రెట్ పార్టీల్లో ఎనర్జిటిక్ గా గడిపెందుకే పూరి డ్రగ్స్ తీసుకున్నారని, ఎంతోమందికి అలవాటు చేసారు, హీరోయిన్లకి కూడా అంటించారు, ఛార్మీ కూడా డ్రగ్స్ తీసుకుంటుంది అంటూ చెప్పుకుంటూ పోయారు శ్యాం.
ఆయన ఇలా అప్రూవర్ గా మారడం ఎవరు ఊహించనిదే.పూరి లాగే శ్యాం దగ్గరి నుంచి కూడా అధికారులు బ్లడ్ సాంపిల్, వెంట్రుకలు, గోళ్ళు తీసుకున్నారు.శ్యాంకి డ్రగ్స్ అలవాటు ఉందొ లేదో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు తేలుస్తారు.విచారణలో ఈరోజు ఆర్టిస్టు, పూరి జగన్నాథ్ మిత్రుడి సుబ్బరాజు వంతు.