GST .GST .
GST ఏ టీవీ ఛానెల్ మార్చినా ఇదే, పేపర్లో ఏ పేజి తిరగేసినా ఇదే, బయట ఎవరినైనా కదిలించినా ఇదే, రోజంతా గడిపే సోషల్ మీడియాలో కూడా ఇదే టాపిక్.ఈ GST వలన లాభామా నష్టమా అని మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది.
పెద్ద పెద్ద ఎకానామాస్టుకే GST మీద పూర్తి అవగాహనతో మాట్లాడలేకపోతున్నారు.కొన్నిరోజులు గడిచేదాకా సమాన్య ప్రజలకు GST పూర్తి ప్రభావం అర్థం అవడం కష్టం.సర్లేండి ఇప్పుడు అంత పెద్ద చర్చ ఎందుకు కాని, సింపుల్ గా, ఈ GST ప్రభావం ప్రేమికుల మీద ఎలా ఉండబోతోందో చూద్దాం.
* వీకెండ్ సినిమా అంటే ఖర్చు తప్పదు :
ప్రేమికులు వీకెండ్ లో చేసే పని ఏమిటంటే సినిమాకి వెళ్ళడం.ఇప్పటికే మల్టిప్లెక్సుల్లో సినిమాలు చూడ్డం కష్టంగా ఉంటే, ఇకనుంచి మరింత కష్టంగా ఉండబోతోంది.తెలుగు రాష్ట్రాల్లో 14% ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, GST వలన 120 కన్నా ఎక్కువ టికేట్ రేటుకి 28%, అంతకన్నా తక్కువ టికేట్ రేటుకి 18% అయిపోయింది.
మరి ఈ భారం ఎవరి మీద పడుతుంది? చివరకి ప్రేక్షకుడి మీదే.తెలంగాణ ప్రభుత్వం మొన్నే ప్రకటించిన టికేట్ రేట్లు పెంపుని తాత్కాలికంగానైతే ఆపేసింది కాని, ఇప్పుడున్న టికేట్ రేట్లకి ఈ GST వలన నష్టమే కాబట్టి టికేట్ రేట్లు పెంచమని సినీపెద్దలు ఎలాగో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు.దాంతో సినిమా కాస్ట్లీ అయిపోనుంది.
* ఏసీ రెస్టారెంట్‌లో అయితే ఓకే :
ఇక సాయంత్రాల్లో లవర్స్ కలిసే మరోచోటు రెస్టారెంట్.నిజానికి థియేటర్లో కంటే రెస్టారెంట్లోనే ఎక్కువ దర్శనిమిస్తుంటారు.GST వలన ఏసి రెస్టారెంట్స్ లో రేట్లు తగ్గనున్నాయి.కాబట్టి ఇకముంచి హ్యాంగ్ ఔట్స్ పెంచుకోవచ్చు.ఏసి రెస్టారెంట్స్ పై ఉన్న 28% భారం కాస్త 18% కి తగ్గింది.
అలాగని నాన్ రెస్టారెంట్లలో ఇదే ట్రెండ్ అనుకోకండి.అక్కడ రేట్లు పెరుగుతాయి.
*కండోమ్ ఫర్వాలేదు :
ఇక లవర్స్ అన్నాక కొన్ని కొంటె పనులు కూడా చేస్తారు.అలాంటి సమయాల్లో సురక్షణకి పెద్దగా ఖర్చేమి కాదు.
ఎందుకంటే గర్భనిరోధక మాత్రలు, కండోమ్ .వీటిమీద GST ప్రభావం అంతగా ఉండబోదు.
* గిఫ్ట్స్ కూడా కష్టమే :
గిఫ్ట్ షాపులు కూడా రేట్లు పెంచేస్తాయి.ఇక్కడ కూడా 28% GST ఉంటుంది.వారానికో గిఫ్ట్ ఇచ్చే బాయ్ ఫ్రెండ్ ఇకనుంచి ముందువెనుక ఆలోచించాల్సిందే.
* తిరగటం ఓకే :
కార్ల ధరలు తగ్గుతాయి.క్యాబ్స్ లో తిరగటం కూడా ఓకే.ఇక విమానాల్లో ప్రయాణం చేయాలంటే మాత్రం ఎకనామిక్ క్లాస్ అయితే బెటర్.