అగ్రనిర్మాత దిల్ రాజు మంచి ఊపుమీద ఉన్నారు.గత ఏడాది వరుస బ్లాక్ బస్టర్లు, సక్సెస్ సినిమాల పంపిణితో భారి లాభాలు వెనకేసుకున్న ఈ నిర్మాత ఈ ఏడాదిని కూడా బ్రహ్మాండంగా ప్రారంభించారు, అదే ఊపు కొనసాగిస్తున్నారు.
శతమానం భవతి ఏ ఏడాదిలో ఇప్పటివరకు అత్యంత లాభకరమైన సినిమాగా నిలిస్తే, నేను లోకల్ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇప్పుడు డిజే కూడా మొదటివారం ఆదరగోట్టింది.
అలాగే పంపిణి వైపు కూడా లాభాలు పొందుతున్నారు దిల్ రాజు.
అదే స్పీడుతో స్పైడర్ రైట్స్ దక్కించుకునే పనిలో పడ్డారు దిల్ రాజు.26 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారు.మరోపక్క స్పైడర్ డీల్ కన్ఫర్మ్ కాకముందే ఇటువైపు ఎన్టీఆర్ జై లవ కుశ నైజాం రైట్స్ పట్టేశారు దిల్ రాజు.
రేటు ఎంత పెట్టారో బయటకి ఇంకా తెలియలేదు కానీ ఎన్టీఆర్ కెరీర్ లో హయ్యెస్ట్ డీల్ అంట.మరో వైపు నాన్ బాహుబలి రికార్డు రేటు చెల్లించి స్పైడర్ నైజం రైట్స్ ఫైనల్ చేసుకోబోతుండగా, ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్టు దిల్ రాజుకి షాక్ ఇచ్చింది.
జై లవ కుశ సెప్టెంబర్ 21న వస్తున్నట్లు అనౌన్స్ చేసారు.దీంతో చిక్కుల్లో పడ్డారు దిల్ రాజు.ఎందుకంటే స్పైడర్ కూడా అదే సమయానికి వస్తుంది.రెండు సినిమాల నైజాం హక్కులు ఒక్కడికే ఎలా ఇస్తారు ? దాంతో జై లవ కుశ విడుదల తేదిలో మార్పు గురించి ఆలోచించమని ఎన్టీఆర్ ని అడిగారట దిల్ రాజు.కాని అందుకు ఎన్టీఆర్ నో చెప్పడంతో స్పైడర్ నిర్మాతలు దిల్ రాజుతో కాబోతున్న డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నారట.జై లవ కుశ విడుదల తేదిలో మార్పు జరిగితే తప్ప స్పైడర్ నైజాం హక్కులు దిల్ రాజుకి దక్కడం దాదాపు అసాధ్యం.
దీన్ని బట్టి దసరాకి మహేష్ – ఎన్టీఆర్ పోటి ఖాయమని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక సైడర్ నైజాం హక్కుల విషయానికి వస్తే, దిల్ రాజు సైడ్ అవడంతో ఏషియన్ వారు రంగంలోకి దిగారు.ఈ ఏడాది ఖైది నం 150, బాహుబలి 2 సినిమాలు నైజంలో పంపిణి చేసి ఇప్పటికే ఊపు మీద ఉన్న ఏషియన్ వారు, స్పైడర్ పై కూడా కన్నేశారు.26-30 కొట్లలో కొత్త డీల్ జరగబోతోందని సమాచారం.