నెల మారుతుందంటే ఆర్ధికపరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి.గ్యాస్ ధరల్లో( Gas Prices ) మార్పులు జరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తీసుకునే నిర్ణయాలు కొత్తగా అమల్లోకి వస్తూ ఉంటాయి.
రేపటితో ఆగస్టు ముగిసి ఎల్లుండి నుంచి సెప్టెంబర్( September ) రాబోతుంది.ఈ సెప్టెంబర్‌లోనే అనేక మార్పులు జరగడంతో పాటు కొత్త నిర్ణయాలు అమల్లోకి రాబోతున్నాయి.
వాటి గురించి ముందే తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్త పడవచ్చు.వచ్చే నెలలో జరగనున్న మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.2 వేల నోట్లను( Two Thousand Notes ) చలామణి నుంచి తొలగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది.దీంతో వచ్చే నెలలో రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసే గడువు ముగియనుంది.దీంతో ఇంకా తమ దగ్గర రూ.2 వేల నోట్లు కలిగి ఉన్నవారు వెంటనే బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయడమా లేదా దానికి బదులు వేరే నోట్లు తీసుకోవడమా అనేది చేయాలి.ఇక యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డును తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది.
సెప్టెంబర్ 1 నుంచి ఆ కార్డుపై వార్షి రుసుం వసూలు చేయనుంది.ఇక ఆధార్ కార్డులో( Aadhar Card ) ఏవైనా తప్పులు ఉంటే ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ అందిస్తుంది.

సెప్టెంబర్ 14 వరకు ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.ఆ తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఛార్జీలు వసూలు చేస్తారు.ఇక పాన్, ఆధార్ కార్డు లింక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇస్తారు.ఒకవేళ అప్పటిలోగా లింక్ చేసుకోకపోతే అక్టోబర్ 1 నుంచి పాన్ కార్డు( Pan Card ) పనిచేయదు.
ఇక ఎస్‌బీఐ( SBI ) ప్రత్యేక సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు సెప్టెంబర్ తో ముగియనుంది.సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ పెట్టుబడి పథకంలో చేరే అవకాశం ఉంటుంది.