తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అలిపిరి నుంచి తిరుమల వరకు ఇనుక కంచె వేయాలని పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ కోర్టులో పిటిషన్ వేశారు.ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు భక్తుల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఇందులో భాగంగానే ఫారెస్ట్ అధికారులకు, టీటీడీకి నోటీసులు జారీ చేసింది.ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో దానిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.