టాలీవుడ్ అక్కినేని హీరో కింగ్ మన్మధుడు నాగార్జున( Nagarjuna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుసగా సినిమాలలో నటించినప్పటికీ నాగార్జున రేంజ్ కి తగ్గట్టుగా ఒక సినిమా కూడా హిట్ టాక్ ని తెచ్చుకోవడం లేదు.హిట్ టాక్ సంగతి పక్కన పెడితే నాగ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి.
దాంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నాగార్జున కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం కూడా ఒకటి.నాగార్జున నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యాయి అని చాలామందికి తెలియదు.మామూలుగా ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం అన్నది చాలా అరుదు.
అలా 28 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయట.ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అవి సక్సెస్ అయ్యాయా లేక ఫ్లాప్ అయ్యాయా అనే విషయానికి వస్తే.టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో నాగ్ నటించిన మాస్ ఎంటర్టైనర్ ఘరానా బుల్లోడు..

ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ,( Ramya Krishnan ) ఆమని నటించిన విషయం తెలిసిందే.1995 ఏప్రిల్ 27న విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.ఇక అదే రోజు ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు( Ghatotkachudu ) సినిమా కూడా విడుదలైంది.
అలీ, రోజా జోడీగా కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నాగార్జున స్పెషల్ రోల్, సాంగ్ లో కనిపించారు.ఇక ఇదే మూవీలో రాజశేఖర్, శ్రీకాంత్ కూడా అతిథి పాత్రల్లో మెరిశారు.
ఇలా అప్పట్లో ఒకే రోజున నాగార్జున తెరపై దర్శనమిచ్చిన సినిమాలుగా ఘరానా బుల్లోడు( Gharana Bullodu ), ఘటోత్కచుడు రికార్డులకెక్కాయి.