భారత్-పాకిస్థాన్ మధ్య పోరు పై మాజీ క్రికెటర్ తెరపైకి తెచ్చిన 5 ప్రశ్నలు..!

ఆసియా కప్( Asia Cup ) లో భాగంగా సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఆసియా కప్ ఆడే భారత జట్టులో కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే.

 5 Questions Raised By Former Cricketer On India-pakistan Match , Asia Cup , Aaka-TeluguStop.com

అయితే ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా( Aakash Chopra ) ట్విట్టర్ వేదికగా ఐదు ప్రశ్నలను సంధించాడు.ప్రస్తుతం ఈ ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.

Telugu Aakash Chopra, Asia Cup, India, Latest Telugu, Pakistan, Virat Kohli-Spor

తొలి పోరులో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ కు వస్తారనే దానిపై ఓ స్పష్టతకు రావలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు.కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్లకు దూరం అవుతున్న సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలను ఆకాష్ చోప్రా సంధించడం జరిగింది.ఆ ప్రశ్నలు ఏమిటో చూద్దాం.

Telugu Aakash Chopra, Asia Cup, India, Latest Telugu, Pakistan, Virat Kohli-Spor

ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడా.? అలా అయితే శుబ్ మన్ గిల్ ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు.? 1-2-3 స్థానాల్లో రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ వస్తే.కోహ్లీ( Virat Kohli ) నాలుగో స్థానంలో వస్తాడా.? ఆలా కాకుండా రోహిత్ శర్మ- గిల్ ఓపెనర్లుగా వస్తే.విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో, ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో వస్తారా.? ఒకవేళ గిల్ బెంచ్ కే పరిమితమైతే తిలక్ వర్మ/సూర్య కుమార్ యాదవ్ లలో ఒకరు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తారా.? ఈ ప్రశ్నలను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు.కొందరు బీసీసీఐని తప్పు బడితే, మరికొందరు తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు.

ఇంకొందరు సూర్య కుమార్ యాదవ్ తప్పకుండా కీలక పాత్ర పోషిస్తాడని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube