అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.
జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.
ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా మరణిస్తున్నారు.
తాజాగా అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.
రాజధాని వాషింగ్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.ఒకరు గాయపడ్డారు.
తూర్పు వాషింగ్టన్‌లోని ఫిన్లీలో బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాల్పుల్లో మృతి చెందిన బెంటన్ కౌంటీనే ఫైరింగ్‌కు పాల్పడి ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్‌ల్యాండ్‌లో పోలీసులకు లభించింది.
కాల్పుల శబ్దాలు వినబడడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు.
వారు వచ్చేటప్పటికే ముగ్గురు వ్యక్తులు విగత జీవులై కనిపించారు.కాల్పుల ఘటనలో రెండు ఇళ్లకు కూడా నిప్పంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది.
అలాగే అక్కడికి కొద్ధి దూరంలో పోలీసులకు ఓ ట్రక్కు కనబడిందని.బహుశా ఆ వాహనంలో దుండగుడు దాక్కుని ఉండవచ్చునని భావించిన పోలీసులు ఆ వాహనంపైకి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఆ కాసేపటికి ఆ ట్రక్కు నుంచి ఒకరి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ దుండగుడే కాల్పులకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
మంటలంటుకున్న ఇళ్లలో రెండు డెడ్ బాడీలను కనుగొన్నామని పోలీసులు చెబుతున్నారు.అయితే దుండగుడు ఎందుకిలా కాల్పులకు తెగబడ్డాడో.ఇళ్లను కూడా ఎందుకు తగులబెట్టాడో తెలియడంలేదని, దర్యాప్తు జరుపుతున్నామని కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ చెప్పారు
.