Kentucky : అమెరికా : కెంటుకీలో స్కూళ్లకు బాంబు బెదిరింపు.. వాలంటైన్స్ డే ఫ్రాంక్‌గా పోలీసుల అనుమానం

అమెరికాలోని కెంటుకీలో ( Kentucky, USA )24 గంటల వ్యవధిలో నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఇది వాలెంటైన్స్ డే( Valentine’s Day ) నేపథ్యంలో ఫ్రాంక్ కాల్‌గా పోలీసులు భావిస్తున్నారు.

 4 Kentucky Schools Evacuated After Hoax Bomb Threats Police Suspect Valentines-TeluguStop.com

మరో రెండు దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. డబ్ల్యూఎల్‌డబ్ల్యూటీ( WLWT ) 5 ప్రకారం.

బెదిరింపులు తొలుత మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చాయి.బుధవారం బూన్ కౌంటీ హైస్కూల్‌లో పేలుడు సంభవించిందని కాల్‌లు పేర్కొన్నాయి.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు ఆ ప్రాంతానికి చేరుకుని లాక్‌డౌన్ విధించాయి.చివరికి ఆ పాఠశాలలో ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించాయి.

Telugu Kentuckyschools, Boonecounty, Kentucky, Day Prank, Wlwt-Telugu NRI

బుధవారం ఒక ప్రకటనలో.బూన్ కౌంటీ స్కూల్ డిస్ట్రిక్ట్ ( Boone County School District )ఇలా చెప్పింది.విద్యార్ధులందరి భద్రత మాకు చాలా ముఖ్యమైనదని, భద్రతను నిర్ధారించడానికి ఈ విపత్కర పరిస్ధితుల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది.మరుసటి రోజు కానర్ హైస్కూల్ .సెయింట్ హెన్రీ హైస్కూల్, బీచ్‌వుడ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లకు సైతం బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తాత్కాలికంగా ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించగా .సిన్సినాటీ / నార్తర్న్ కెంటుకీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ బాంబ్ యూనిట్ పాఠశాల మైదానంలో శోధించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించేదు.

Telugu Kentuckyschools, Boonecounty, Kentucky, Day Prank, Wlwt-Telugu NRI

అధికారులు చెబుతున్న దాని ప్రకారం.హాట్‌లైన్‌లకు ప్రతికాల్ ముందుగా రికార్డ్ చేయబడటమో లేదా కృత్రిమంగా తయారు చేయబడిన వాయిస్‌ని ఉపయోగించి చేసినట్లు కనిపించింది.టైటిల్‌లు, హ్యాష్‌టాగ్‌లతో ఇలాంటి బెదిరింపుల రికార్డింగ్‌లతో కూడిన సోషల్ మీడియా పోస్టులను పరిశోధకులు కనుగొన్నారు.

బోగస్ బెదిరింపుపై వారికి అనుమానాలు ఉన్నప్పటికీ బూన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం.సంబంధిత పార్టీల భద్రతను పొందే వరకు ప్రతి బెదిరింపును నిజమైనదిగానే భావిస్తామని పేర్కొంది.బాంబు డ్రామాకు సంబంధించిన నిందితుడు ఇంకా తెలియనప్పటికీ , అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.మీడియా నివేదికల ప్రకారం.

హారిస్‌బర్గ్‌కు గురువారం ఇదే విధమైన బాంబు బెదిరింపు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube