సినీ సెలబ్రిటీల ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ లుగా ఉన్న వారీ కూతుర్లు కొడుకులు ఎవరైనా పెద్దవారు అయ్యారంటే చాలు ఇక హీరోహీరోయిన్లుగా వాళ్ళ ఎంట్రీ ఎప్పుడు అన్న వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది.
ఇక ఇండస్ట్రీలో ఉన్న సినీ సెలబ్రిటీలు అందరూ తమ కూతురు కొడుకులని సినిమాల్లోకి తీసుకువస్తు ఉండటం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం.
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్ కూతురు కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అని తెలుస్తుంది.
ఆ స్టార్ కమెడియన్ ఎవరో కాదు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్. డైలాగ్ డెలివరీలో హావభావాలు పలికించడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని స్టార్ కమెడియన్ గా ఎదిగాడు పృథ్విరాజ్.
ముఖ్యంగా ఖడ్గం చిత్రంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ డైలాగ్ చెప్పి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించాడు.ఆ డైలాగ్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనే సీక్రెట్ బయట పెట్టాడు పృథ్వీరాజ్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.మా అమ్మాయి పేరు శ్రీలు, సినిమాల్లోని అనేక సన్నివేశాలు చూసి అనుకరిస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది.నటనపై ఎంతో ఆసక్తి.
యాక్టింగ్ డాన్స్ కూడా నేర్చుకుంది.హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కూడా పూర్తి చేసింది.
కానీ నటన మీద ఆసక్తితో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.చాలా గ్రాండ్గా టాలీవుడ్లోకి మా అమ్మాయిని తీసుకొద్దాం అనుకున్నా.
అది కుదరలేదు.రంగుల ప్రపంచం అనే సినిమాతో మా అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.
ఈ సినిమాలో నా స్నేహితుడు కుమారుడు హీరో.ఇక ఇన్నాళ్ళు నన్ను ఆదరించినట్లు గానే మా అమ్మాయిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా అంటూ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్.