ఒక్క సినిమాకు రెండు రిలీజ్ డేట్లు.. దర్శక నిర్మాతల తిక్క చేష్టలు..

సినిమా అన్నాక ఓ పద్దతి ఉంటుంది.ఫలానా సమయానికి సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి.

 2 Release Dates For Every Movie , Raviteja, Ramarao On Duty, Ghani , Varun Tej,-TeluguStop.com

ఈ సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయాలి.ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవాలి.

చివరగా ఈ సమయానికి సినిమా రిలీజ్ చేయాలి అని పక్కా ప్లాన్ ఉంటుంది.అయితే ప్రస్తుతం రాజమౌళి పుణ్యమా అని.ఓ సినిమాకు రిలీజ్ డేట్ ఎప్పుడో అని చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.గతంలో ఫలానా తేదీన సినిమా విడుదల అవుతుంది అంటే అదే రోజు రిలీజ్ చేశారు.

కానీ ఇప్పుడు ఎప్పుడు సినిమా విడుదల అవుతుందో చెప్పడం కష్టంగా మారింది.వాస్తవానికి రాజమౌళి తాజా సినిమా ఆర్ఆర్ఆర్ ఎప్పుడో రిలీజ్ కావాలి.కానీ ఆయా కారణాలతో పలుమార్లు వాయిదా పడింది.తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెండు డేట్లు ప్రకటించాడు.

మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల అవుతుందని చెప్పాడు.తాజాగా ఈ రెండు డేట్లు కాదని మార్చి 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.

రాజమౌళి అనుసరించిన విధానాన్నే చాలా మంది సినిమాలకు వాడుతున్నారు.తెలుగు సినిమా నిర్మాతలు చిన్నాచితకా సినిమాలకు కూడా రెండు డేట్లు ప్రకటిస్తున్నారు.తాజాగా వరుణ్ తేజ్ గని సినిమాకు కూడా రెండు డేట్లు ప్రకటించారు.ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అటు పవన్ కల్యాణ్ సైతం తన తాజా మూవీ భీమ్లా నాయక్ కు కూడా ఇదే రీతిలో రెండు రిలీజ్ డేట్లు ప్రకటించారు.ఫిబ్రవరి 25న లేదంటే మార్చి 1న తన సినిమాను జనాల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు.

అటు రవితేజ కూడా తానేం తక్కువ కాదన్నట్లు తన తాజా సినిమా రామారావు ఆన్‌ డ్యూటీకి రెండు రిలీజ్ డేట్లు ప్రకటించాడు.మార్చి 25 లేదంటే ఏప్రిల్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

అయితే వీళ్లు ప్రకటించిన డేట్లలో ఆ సినిమాలు రిలీజ్ అవుతాయన్న గ్యారెంటీ కూడా లేదు.రాజమౌళి రెండు డేట్లు ప్రకటించి.చివరకు మార్చి 25న రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.మొత్తంగా సినిమా వాళ్ల చేష్టలకు జనాలు వెర్రోళ్లు అవుతున్నారు.అంతేకాదు.సినిమా దర్శక నిర్మాతలకు కనీసం తమ సినిమా రిలీజ్ డేట్ల విషయంలోనూ క్లారిటీ లేకపోవడం సిగ్గు చేటు అనే మాటలు వినిపిస్తున్నాయి.

2 Release Dates For Every Movie , Raviteja, Ramarao On Duty, Ghani , Varun Tej, Bheemlanayak, Pawan Kalyan, Rrr, Rajamouli , Tolllywood - Telugu Bheemlanayak, Dates, Ghani, Pawan Kalyan, Rajamouli, Ramarao Duty, Raviteja, Tolllywood, Varun Tej

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube