టీడీపీ అధినేత చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆరు వందల హామీలు ఇచ్చి అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.
ప్రజలను మళ్లీ మోసం చేయాలనే మాయ మాటలు చెప్తున్నారని మంత్రి మేరుగ విమర్శించారు.సీఎం జగన్ పాలనలో అవినీతి జరిగినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు.14 ఏళ్ల చంద్రబాబు పాలన… నాలుగేళ్ల జగన్ పాలనపై చర్చకు రండి అంటూ సవాల్ చేశారు.కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయ భిక్ష పెట్టిందని వైఎస్ఆర్ అని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కన్నా ఎక్కడ పోటీ చేస్తారో.? ఎక్కడ గెలుస్తారో చూద్దామని తెలిపారు.