తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మొక్కజొన్న కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 Key Decision Of Telangana Sarkar.. Green Signal For Purchase Of Maize-TeluguStop.com

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని సమాచారం.దీంతో సుమారు 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు కరీంనగర్ జిల్లాలలో ప్రధానంగా మొక్కజొన్నను రైతులు సాగు చేశారు.కాగా మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వం మద్ధతు ధర రూ.1962 అని తెలిపింది.అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube