కంది పంట( Redgram Cultivation ) ప్రధాన పప్పు దినుసుల పంటలలో ఒకటి.కంది పంటను వర్షాధార పంటగా బీడు భూములలో సాగు చేసి దిగుబడులు సాధించవచ్చు.
నీటి వనరులు ఉంటే నీటి కంది రకాలను సాగు చేసి దిగుబడులు సాధించవచ్చు.ఈ కంది పంటకు దాదాపుగా అన్ని రకాల నెలలు అనుకూలంగానే ఉంటాయి.
కంది పంట వర్షాధార పంటగా ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న పంట.కంది పంట వేసే నేలను వేసవికాలంలో బాగా లోతు దుక్కులు దున్ని, ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం, 8 కిలోల నత్రజని వేసి కలియ దున్నుకోవాలి.ఆ తర్వాత నేల వదులుగా అయ్యేలాగా రెండు లేదా మూడుసార్లు దమ్ము చేసుకోవాలి.
కంది పంటను వివిధ రకాల తెగుళ్లు లేదంటే చీడపీడల వ్యాప్తి( Pests and Weeds ) నుండి సంరక్షించుకోవాలంటే విత్తుకునే విధానం అత్యంత కీలకము.నేల నుండి వివిధ రకాల తెగుళ్లు కంది పంటను ఆశించకుండా ఉండాలంటే ముందుగా విత్తనాలను విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత విత్తుకోవాలి.ఒక కిలో విత్తనాలను ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లొప్రిడ్ ఎఫ్.ఎస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఆ తర్వాత మొక్కల మధ్య 25 సెంటీమీటర్ల దూరం మొక్కల వరుసల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
మొక్కలు ఎక్కువగా ఎత్తు పెరిగితే మొక్క చివర్లను 30 సెంటీమీటర్ల పొడవు వరకు చివర్లను కత్తిరించాలి.దీంతో మొక్కకు పక్కకొమ్మలు అధికంగా వస్తాయి.
కంది పంటలో కలుపును నివారిస్తే వివిధ రకాల చీడపీడల తెగుళ్ల బెడద దాదాపుగా ఉండదు.నేలలో కంది విత్తనం విత్తిన రెండు రోజులలోపు ఒక లీటర్ నీటిలో 5ml పెండిమిథాలిన్ ను కలిపి పిచికారి చేయాలి.కంది మొక్కలు రెండు లేదా మూడు అడుగుల పొడవు పెరిగిన తర్వాత గొర్రు లేదా గుంటికతో అంతర సేద్యం చేయాలి.నీటి వనరులు ఉంటే పంట పూత దశలో ఉన్నప్పుడు నీటి తడులు అందిస్తే చాలు ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.