అందుకే రాజీనామా చేస్తున్నాం

సూర్యాపేట జిల్లా:పెన్‌పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామంలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.అధికార పార్టీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ దాచేపల్లి నాగయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం తెలిపారు.

 That Is Why We Are Resigning-TeluguStop.com

ఉప సర్పంచ్‌తో పాటు గ్రామానికి చెందిన ఆరుగురు వార్డు మెంబర్లు గంగారపు సునీత,మేకపోతుల దుర్గా,నాగమల్ల రాంబాబు,కంచి విజయ్,కొండ నాగరాజు,నారాయణ పిచ్చమ్మలతో పాటు గ్రామ కో-ఆప్షన్ సభ్యులు ఏదుల అంజయ్య,షేక్ అంబానీ,కట్ల శ్రీనివాస్ రెడ్డిలు రాజీనామా చేశారని తెలిపారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు నచ్చకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

అంతేగాక,ఈ ఏడాది గ్రామానికి విడుదలైన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు నుండి సీసీరోడ్లు చేపట్టాల్సి ఉండగా,తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఇతర పార్టీ వ్యక్తులకు పనులు అప్పగిస్తున్నారని,గ్రామాభివృద్ధిలో తమకు భాగస్వామ్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో నాయకులు వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ తమ రాజీనామా పత్రాలను మండల పార్టీ అధ్యక్షులు యుగేందర్‌కు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube