ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో వేడెక్కాయి.అధికారపక్షం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి పై అసెంబ్లీలో దారుణంగా మాట్లాడారని తనను అవమానించారంటూ సభ నుంచి వాకౌట్ అయిన చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై టిడిపి శ్రేణులు పలువురు నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ,వైయస్ జగన్మోహన్ రెడ్డి, రోజా, కన్నబాబు వంటి నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్, జర్నలిస్ట్ జాఫర్ అంబటి రాంబాబు ఇంటర్వ్యూ చేశారు.ఈ క్రమంలోనే జాఫర్ మాట్లాడుతూ తాను అడిగిన అన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని ఈ ప్రశ్న అడుగు,ఈ ప్రశ్న అడగకూడదు ఇలాంటివి ఎందుకు అడుగుతున్నావ్ అనే ప్రశ్నలు వేయకూడదని అలాంటి ప్రశ్నలు వేస్తే ఇంటర్వ్యూ ఇక్కడితో ఆపుదామని అడిగారు.
ఈ విషయానికి అంబటి రాంబాబు స్పందిస్తూ మీరు ఎలాంటి ప్రశ్నలు అడగండి మీరు ఫెయిర్ గా అడిగితే నేను ఫెయిర్ గా సమాధానం చెబుతాను అంటూ చెప్పారు.అంబటి రాంబాబు ఇలా చెప్పడంతో జాఫర్ మొదటి ప్రశ్నగా గతంలో ఒక అమ్మాయిని రూమ్ కి రమ్మని టెలిఫోన్ సంభాషణ వైరల్ గా మారింది.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తనని రూమ్ కి ఎందుకు పిలిచారు? అమ్మాయి వచ్చి ఉంటే మీరేం చేసేవారు ?అనే ప్రశ్నలు అడిగారు.జాఫర్ ఈ ప్రశ్నలకు అంబటి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
మీరు ఇలాంటి ప్రశ్న వేశారు కరెక్టే అయితే ఆ ఫోన్లో మాట్లాడింది నేనేనని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ అందులో నేనే మాట్లాడాను అంటే ఆ ఆడియో పెట్టిన వారు ఎవరు సరైన ఆధారాలతో నిరూపించాలి.ఎవరో గుడ్డ కాల్చి మొహం పై విసిరితే దానికి నేనే బాధ్యత అంటే అందుకు నేను ఒప్పుకోను దీనిపై నేను కూడా కంప్లైంట్ చేశాను విచారణ జరుగుతుంది తొందరలోనే రిపోర్ట్ వస్తుంది.ఆ తరువాత ఈ వీడియో వెనుక ఎవరు ఉన్నారో బయటపడుతుంది అంటూ అంబటి రాంబాబు సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే బాధితురాలు ఎవరో బయటకు రాలేదు కనుక మీరు నిర్దోషి అంటున్నారా? అని ప్రశ్న వేయగా.అసలు బాధితురాలు ఉంటే కదా బయటకు రావడానికి అంటూ అంబటి సమాధానం చెప్పారు.కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను మానసికంగా దెబ్బ కొట్టడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేశారని గతంలో కూడా ఇలాంటి ఆడియో ఒకటి నా గురించి బయటకు వచ్చింది అయితే దాని గురించి ఎంక్వైరీ చేయించి అసలు విషయాన్ని బయట పెట్టామని ఈ విషయం గురించి కూడా తొందరలోనే రిపోర్ట్ వస్తుందని, అసలు నిజానిజాలు ఈ ఆడియో టేప్ వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాలన్నీ బయటపడతాయని అంబటి రాంబాబు తెలియజేశారు.