ఏపీలో ఓట్ల తొలగింపు రగడ! హైదరాబాద్ లో ఐటీ కంపెనీపై పోలీసులు దాడి!

ఏపీలో ఆధార్ కార్డు ఆధారంగా డేటా చోరీకి పాల్పడుతూ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఓట్ల తొలగింపుకి కొన్ని ఐటీ కంపెనీలు పాల్పడుతున్నాయి అని ప్రతిపక్ష వైసీపీ చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్ల తొలగింపుకి టీడీపీ పాల్పడిందని, వైసీపీ నేతలు ఆధారాలతో సహా నిరూపించడంతో పాటు హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ కంపెనీ ప్రభుత్వ పథకాల ద్వారా ఆధార్ కార్డు డేటా చోరీ చేసి సర్వేల పేరుతో ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఓట్లని అడ్డ దారిలో తొలగిస్తుందని వైసీపీ ప్రతినిదుల్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకి కంప్లైంట్ చేసారు.

 Ysrcp Complaint Against Tdp For Deleting Voters-TeluguStop.com

హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్ అనే సంస్థ డేటా చోరీకి పాల్పడుతూ ఓట్ల తొలగింపుకి పాల్పడుతుందని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వున్నారు.ఇప్పటికే ఈ సంస్థకి చెందిన ఏడు మందిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు ఈ కంపెనీ అధినేత భాస్కర్ ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది.

అయితే ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు ఏపీ ప్రభుతం ఆంధ్రా పోలీసులని వాడుకుంటుంది అని తెలుస్తుంది.ఇప్పటికే ఆ ఐటీ కంపెనీ నుంచి భాస్కర్ అనే వ్యక్తి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడం దానిపై విచారణకి ఏపీ పోలీసులు హైదరాబాద్ రావడం వంటి పరిణామాలు వైసీపీ ఆరోపణలకి బలం చేకూరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube