ప్రముఖ తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ ఆరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి తాజాగా తన కూతురు అక్షర హాసన్, శృతిహాసన్ ట్విట్టర్ ద్వారా కమల్ హాసన్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు.తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఏవేవో వార్తలు వస్తున్నాయని అయితే అవన్నీ కేవలం అపోహలు అంటూ తాజాగా తన కూతుర్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కమల్ హాసన్ కాలికి శాస్త్ర చికిత్స జరిగిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
చెన్నైలోనే ప్రముఖ రామచంద్ర హాస్పిటల్ లో కమల్ హసన్ కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు.అయితే నాలుగైదు రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు.
నాలుగైదు రోజుల తర్వాత ఒకసారి పరీక్షించి తనని డిస్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు.కాలికి ఆపరేషన్ చేయటం వల్ల కొన్ని రోజుల పాటు ఎక్కడికి బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తర్వాత వచ్చి ప్రజలందరిని కలుస్తారని ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ కూతుర్లు తెలియజేశారు.

ఈ సంవత్సరంలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కమల్ హాసన్ పాల్గొంటూ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించినట్లు మనకు తెలిసిందే.ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్ హాసన్ కాలికి తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లడంతో ఆపరేషన్ నిర్వహించాలని డాక్టర్లు సూచించారు.దీంతో కమల్ హాసన్ కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు, నాన్న పై చూపిన ప్రేమకు, అభిమానానికి కమల్ హాసన్ కూతురు ఇద్దరు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.