ఏపీ విభజన హామీలకు సంబంధించి ప్రధాని మోదీకి షర్మిల లేఖ..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) మంగళవారం ప్రధాని మోదీకి ( Prime Minister Modi )లేఖ రాశారు.ఏపీ పునర్విభజన చట్టంలో హామీలు దశాబ్దం తర్వాత కూడా అమలు చేయలేదని అంశాల వారీగా వివరించారు.

 Ys Sharmila Letter To Pm Modi Regarding Promises Of Partition, Ys Sharmila, Pm-TeluguStop.com

విభజన జరిగి దశాబ్దం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని నగరం లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు పరచలేదని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు గడిచిన నేటికీ ఒక హామీ కూడా నెరవేరలేదన్నారు.దశాబ్ద కాలం నుండి ఆంధ్ర ప్రజలు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు.

దీంతో నేడు రాష్ట్రం గందరగోళం నిస్సహాయత స్థితిలో ఉందని అన్నారు.

విభజన జరిగిన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని హామీ ఇచ్చారు.కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ డిమాండ్ ను పూర్తిగా విస్మరించిందని చెప్పుకొచ్చారు.పర్యావసనంగా నేడు ఆంధ్రప్రదేశ్ పురోగతి అభివృద్ధి లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చారు.పోలవరం రాష్ట్ర ప్రజల హక్కు అని… అటువంటి ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా ఉందని వ్యాఖ్యానించారు.

లేఖలో ఉన్న ఈ అంశాలను ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకుని వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube