YS Sharmila : ఏపీలో నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం అయింది.ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఆమె జిల్లాల్లో పర్యటించనున్నారు.

 Ys Sharmila District Tour In Ap From Today-TeluguStop.com

దాదాపు ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటించనున్న షర్మిల ఉదయం రచ్చబండ, సాయంత్రం బహిరంగ సభలను నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా ఇవాళ బాపట్ల నియోజకవర్గం( Bapatla Assembly constituency )లో పర్యటించనున్న షర్మిల సాయంత్రం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

రేపు తెనాలిలో రచ్చబండ కార్యక్రమంతో పాటు సాయంత్రం దెందులూరులో సభకు హాజరుకానున్నారు.ఈనెల 9న ఉదయం కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం తునిలో బహిరంగ సభ., అలాగే 10వ తేదీ ఉదయం నర్సీపట్నం( Narsipatnam )లో రచ్చబండ, సాయంత్రం పాడేరులో బహిరంగ సభకు షర్మిల హాజరుకానున్నారు.అదేవిధంగా 11న నగరిలో నిర్వహించనున్న బహిరంగ సభతో షర్మిల పర్యటన పూర్తి కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube