దుబాయిలో సందడి చేస్తున్న అల్లాఉద్దీన్.. ఈ యూట్యూబర్ క్రియేషన్ మాములుగా లేదుగా..!

అల్లా ఉద్దీన్ అద్భుత దీపం గురించి మీరు వినే ఉంటారు.90వ దశాబ్దంలో అల్లాద్దీన్ క్యారెక్టర్ అంటే యమ క్రే జ్ ఉండేది.అల్లాఉద్దీన్ క్యారెక్టర్ తో చాలా సినిమాలు వచ్చాయి.అల్లా ఉద్దీన్ కథలో ఉండే అద్భుతదీపం, మ్యాజిక్స్, ఎగిరే చాప, అల్లా ఉద్దీన్ వేషధారణ ఇవ్వన్ని భలే విచిత్రంగా ఉంటాయి.

 Youtuber Creates Allauddin Magic Carpet Scene In Dubai Details, Dubai, Allauddin-TeluguStop.com

ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు.ఇవన్నీ కళ్ల ముందు కనిపించేలాగా నడిరోడ్డుపై ఒక వ్యక్తి చేసిన ఫీట్ చూసి అందరు అవాక్ అవుతున్నారు.

నడిరోడ్డుపై అచ్చం అల్లా ఉద్దీన్ లాగా ఆ మాయా చాపపై కూర్చొని ప్రయాణిస్తూ వెళ్లడం చూసిన వారందరు నోరెళ్లబెట్టుకును చూస్తూ, మేము చూసేది నిజమేనా అనే ఆలోచనలో ఉంటే మరికొందరు మాత్రం వీడియోలు తీసి తెగ షేర్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియోతో పాటు, ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

ఈ వింత ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది.నేలపై నుంచి కొన్ని అంగుళాల ఎత్తులో పైకి ఎగురుతూ ఒక చాప దూసుకెళ్లి పోతుంటే RhyzOrDie అనే వ్యక్తి తాను వేసుకున్న అల్లాద్దీన్ దుస్తుల్లో మ్యాజిక్ కార్పెట్ పై అద్భుతమైన ఫోజులిస్తూ నిల్చొన్నాడు.

కేవలం రోడ్డు మీద మాత్రమే కాకుండా నీటిపై కూడా తేలేలాగా ప్లాన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

Telugu Allauddin, Allauddinmagic, Create, Dubai, Latest, Rhyzordie, Board, Youtu

అసలు అతను అలాంటి ఫీట్స్ ఎలా చేస్తున్నాడు అనే అనుమానం అందరిలోనూ కలుగుతుంది.ఇంతకీ అసలు అలా ఎలా చేయగలిగాడంటే ఒక ఎలక్ట్రానిక్ లాంగ్‌బోర్డ్ మీద ఒక కార్పెట్ ఏర్పాటు చేసుకుని అలా గాల్లో తేలే ప్రయత్నం చేశాడన్నమాట.అలాగే నేలపై ముందుకెళ్లేందుకు స్కేటింగ్ బోర్డుకు సరికొత్త ఆధునిక టెక్నాలజీని జతపరిచి ముందుకు కదిలే ప్రయత్నం చేశాడు.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు వాట్ అన్ ఐడియా అని అనకుండా ఉండలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube