యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి ఎన్నో సందేహాలు నెలకొనగా తాజాగా ఈ సినిమా మేకర్స్ ఆ సందేహాలకు తెర దించారు.2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని అధికారిక ప్రకటన వెలువడింది.సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది.ఈ సినిమాలో తారక్ కు జోడీగా నటించే బ్యూటీ వివరాలను కూడా త్వరలో వెల్లడించనున్నారు.
ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టనున్నామని మేకర్స్ వెల్లడించారు.ఈ ఏడాదే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ విడుదలవుతుందని భావించిన ఫ్యాన్స్ మాత్రం ఒకింత నిరాశకు గురయ్యారు.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న 5 గొప్ప లక్షణాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ పెద్దలను గౌరవించే విషయంలో ముందువరసలో ఉంటారు.
తన సినిమా వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తే ఆదుకునే విషయంలో తారక్ ముందువరసలో ఉంటారు.అయితే నిర్మాతలకు వెనక్కిచ్చిన డబ్బు గురించి ప్రచారం చేసుకోవడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అస్సలు ఇష్టపడరు.
కెరీర్ తొలినాళ్లలో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.దర్శకధీరుడు రాజమౌళి, మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ తారక్ సినిమాలతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తన సినీ కెరీర్ లో ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి ఆయా దర్శకుల కెరీర్ పుంజుకోవడానికి తారక్ తన వంతు సహాయ సహకారాలు అందించారు.చాలామంది హీరోలు కథలలో వేలు పెడుతుండగా తారక్ మాత్రం తనతో సినిమాలు తీసే డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు.ఈ విషయంలో తారక్ గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.