పవన్ కల్యాణ్ కు కులం, ఓట్లు తప్పా ఇంకేమైనా ఉందా - పేర్ని నాని

అమరావతి: అసెంబ్లి మీడియా పాయింట్ మాజి మంత్రి పేర్ని నాని.పేరు చెప్పడం ఇష్టం లేని ఒక పార్టీ అధ్యక్షుడు నిన్న తియ్యటి అబద్ధాలు చెప్పారు.

 Ycp Ex Minister Perni Nani Shocking Comments On Janasena Pawan Kalyan Details, Y-TeluguStop.com

ఎవరి మీద ద్వేషంతో పార్టీ పెట్టారో, ఎవరిని రాజకీయంగా అడ్డుకోవాలనీ చూసారో, ఎవరి మేలు కోసం చెయ్యాలో అదే నిన్న మళ్ళీ చెప్పారు.బిజెపితో కటింగ్ చెప్పేశాడు.

టీడీపీతో వెళ్లేందుకు సిద్దం అయ్యాడు మోడీ అంటే బయం అందుకే అమిత్ షా, జెపి నడ్డ మంచోడు అంటున్నాడు.కుల బావన లేదని చెప్పిన వ్యక్తి కాపు కులస్తులను రెచ్చగొట్టారు.

కమ్మోల్ల మీద ద్వేషం ఎందుకని కాపులను రెచ్చగొడుతున్నారు.నీ రాజకీయం కోసం రంగా పెళ్లి పైన అయన కుటుంబంపైన నిస్సిగ్గుగా మాట్లాడతారా.

కమ్మొల్లతో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయడం అవసరమా.టిడిపి, జనసేన,కమ్యూనిస్టులు అందరూ కలిసే రావాలని మేము కోరుతున్నాం.

చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని మీరంతా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు.ఎన్నికల వరకు కాకుండా ఇప్పుడే ముసుగు తీసి రావాలి.మీ అవసరాల కోసం 2014కలిసే పోటీ చేశారు.2019 లో వీడి విడిగా పోటీ చేశారు.

Telugu Chandrababu, Perni Nani, Jagan, Janasena, Janasena Day, Pawan Kalyan-Pres

కలిసి వస్తె మిమల్ని ఎన్నికల్లో చితకొట్టి చూపిస్తాం.అబద్ధాలు ఎవడు చెప్పాడు.మీరు చెప్పరా మేము చెప్పామా.తొడలు కొట్టే పార్టిలో మేము లేము.తొడలు కొట్టే పార్టీలో ఉన్నది.మీరే ధృతరాస్టులు దుర్యోదనులు అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే ఉన్నారు.

అర్థ రాత్రి మద్దెల దరువు వేసే నీ వల్ల మాకు ఏమి కాదు.మాతో శిస్తు కట్టించడం నీ వల్ల కాదూ కదా నీ యజమాని వల్ల కూడా కాదు.2009లో రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పడం ఏంటి.మీ ఆన్న కేంద్ర మంత్రిగా చేశాడు మీ ఇంట్లో ఎవ్వరూ రాజకీయాల్లో లేరని చెప్పడం ఏంటి చిరంజీవి ఓడిపోతే ఒంటరిగా వదిలేసింది నువ్వు కాదా.

తాడి చెట్టు ఎందుకు ఎక్కావ్ అంటే దూడ మేత కోసం ఎక్కా అన్నట్లు ఉంధి పవన్ కళ్యాణ్ వ్యవహారం రెండూ కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ ఇన్కమ్ టాక్స్ కడుతున్నాడా.డబ్బులు లేవు అంటున్నాడు రెండు కోట్లు తీసుకుంటున్నా అంటున్నాడు.

Telugu Chandrababu, Perni Nani, Jagan, Janasena, Janasena Day, Pawan Kalyan-Pres

1000 కోట్లు ఇస్తా అని రాసిన వాడు బాగానే ఉన్నాడు చదివిన మేము మీకు లోకువా ?బిసి డిక్లరేషన్ పార్టీ ఆఫీసులో చెప్పి 48 గంటలు గడవక ముందే మచిలీపట్నంలో ఏమి చెప్పావ్.పవన్ కల్యాణ్ కు కులం,ఓట్లు తప్పా ఇంకేమైనా ఉందా.మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం మాకు లేధు.మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరామో మా ఇల్లు అంతే దూరం.నిగుణం, నీ సంకల్పం గొప్పది అయితే నీ చుట్టూనే తిరుగుతామ్.జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతాము జనం కోసం మొండిగా నిలబడి నమ్మిన సిద్ధాంతం కోసం పని వ్యక్తి జగన్ కాబట్టే అయన వెంట నడుస్తున్నాం.

నీ దగ్గర ఏమున్నాయని మేము మీ దగ్గరకు రావాలి.చంద్రబాబు దిక్కు తోచక ప్రభుత్వాన్ని వెలు పెట్టీ చూపించలేక పవన్ కల్యాణ్ తో వెనకుండి మాట్లాడిస్తున్నాడు.

2018లో చంద్రబాబును నానా మాటలు మాట్లాడిన నువ్వు ఇప్పుడు నీతులు చెప్తున్నావ్.స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులది తప్పని చెప్తున్నారు.నీ మాటలు కాపు కులస్థుల నమ్మితే ఏమి చేస్తారో మీకు తెలుసు.60శాతం కాపులు సీఎం జగన్ తోనే ఉన్నారు.కులాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయడం ధర్మమా.కులం పేరుతో చేస్తున్న రాజకీయా క్రీడను నిలిపివేయాలి.2024 ఎన్నికల్లో మీ ఇద్దరు కలిసి నేరుగా వస్తె మేము ఎంటో చూపిస్తాంస్టీల్ ప్లాంట్ కార్మికులు బంద్ చేస్తే ప్రభుత్వమే బంద్ లో పాల్గొంది.స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేయొద్దని ప్రభుత్వం కోరింది.

కుల రహిత సమాజం కోసం పోరాడే వ్యక్తి నిన్న కులాల పేర్లు పదె పదే ప్రస్తావించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube