పూలల్లో ప్రధానమైనది గులాబీ పువ్వు( rose flower ).అందుకే గులాబీ పువ్వు పూలకు రారాణి గా పేరుపొందింది.
కొంతమంది రైతులు గులాబీ పూల సాగు( Cultivation of rose flowers ) పై అవగాహన కల్పించుకుని తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు.గులాబీ పూల సాగులో తక్కువ భూమి.
తక్కువ పెట్టుబడి.తక్కువ శ్రమతో మంచి దిగుబడి వస్తుండడంతో చాలామంది రైతులు ఈ దిశగా దృష్టి సారిస్తున్నారు.
ఇక గులాబీలలో చాలా రకాలు ఉన్నాయి.అయితే బెంగుళూరు రకం, సెంటు రకాలతో మంచి దిగుబడి పొందవచ్చు.
గులాబీ మొక్కలు( Rose plants ) నాటాక ఐదు నుండి 8 సంవత్సరాల వరకు పూల కోత లభిస్తుంది.మొక్కలు నాటిన ఐదు నెలల నుండి చేతికి పంట రావడం ప్రారంభమవుతుంది.మొక్కలు నాటిన 5 నెలల నుండి దాదాపు 8 సంవత్సరాల వరకు ప్రతి నెల ఆదాయం వస్తూనే ఉంటుంది.ప్రతి నెల వందల కేజీలలో గులాబీ పూలు కోతకు వచ్చి దాదాపు 50 వేల వరకు ప్రతినెల ఆదాయం అర్జించవచ్చు.
గులాబీ పూల పెంపకంలో ప్రకృతి విధానాలు ఆశాజనకంగా ఉంటాయి.ఇక నీటిని వృధా చేయకుండా డ్రిప్ విధానంలో నీరు అందించాలి.ఇలా చేస్తే విల్ట్ సమస్య ఉండదు.
రసాయన ఎరువులను వాడకుండా నెలలో రెండుసార్లు పశువుల, కోళ్ల వ్యర్ధాలతో చేసిన ప్రకృతి ఎరువులను మొక్కకు అందించాలి.ఇక మొక్కల చుట్టూ కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.ఎందుకంటే కలుపు మొక్కల వలన చీడపీడల బెడద పెరగడంతో పాటు మొక్కకు సరైన క్రమంలో పోషకాలు అందవు.
కాబట్టి కలుపు లేకపోతే చీడపీడల బెడద తొలగడంతో పాటు, మొక్కకు కావలసిన అన్ని పోషకాలు సమృద్ధిగా అంది సకాలంలో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది.ఇక సంవత్సరం పొడుగునా పూల దిగుబడి వస్తూ ఉండడంతో ఆదాయం లక్షల్లో పొందవచ్చు.