అల్లవరం మండలం బొడుసుకుర్రు లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నాయకులు.యనమల రామకృష్ణుడు కామెంట్స్ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం.
వరద ముంపు గత ఏడు రోజులుగా ఉంటే ప్రభుత్వం రెండు రోజుల నుండే నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం అయంలో సెంట్రల్ డెల్టా మోడరైజేషన్ స్కీం కింద 550 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసాం.
గోదావరి ఏటుగాట్లను ఎత్తు చేసి ప్రతిష్టం చెయ్యడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది.వరదల్లో నష్టపోయిన బాధితులకు ఒక స్కీం ఉంది దాన్ని అమలు చెయ్యకుండా మొక్కుబడిగా పరిహారం అందిస్తున్నారు.
ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, గంటి హరీష్ మధుర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు సత్యానందం, జ్యోతుల నవీన్, వనమాడి కొండబాబు తదితరులు.