సంగీతం అంటే తెలియని వారుండరు.చిన్న వారి దగ్గరి నుంచే పెద్దవారి వరకు దీనికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు.
ప్రతి సందర్భంలో కూడా మ్యూజిక్ అనేది ఒక మంచి విశ్రాంతినే ఇస్తుందని చెప్పాలి.ఇక మ్యూజిక్ అంటే ఎన్నో రకాలుగా ఉంటుంద.
ఇ ఒక్క పరికరంతోనే కాకుండా ఎన్నో పరికరాలతో సంగీతాన్ని వినిపించొచ్చు.సంగీతంలో ఉన్న చాలా రకాల్లో బ్యాండ్ కూడా వస్తుంది.
అయితే సంగీతంలో దాన్ని సృస్టించడానికి పెద్ద పెద్ద పరికరాలు లేకున్నా గానీ చాలామంది తమ దగ్గర ఉన్న చిన్న చిన్న పరికరాలతోనే మ్యూజిక్‌ను అద్భుతంగా సృష్టిస్తారు.
ఇక ఇప్పుడు ఈ సంగీతంలో భాగంగా మన భారతదేశంలోని జుగాద్ గురించి ఇప్పుడు చెప్పాలి.
నిజానికి జుగాద్ అంటే మన దేశంలో చాలామందికి తెలియదేమో గాన పల్లె వాతావరణంలో ఉండే వారికి దీనితో దగ్గరి సంబందాలే ఉంటాయి.ఇక మన దేశం కూడా జుగాద్ విషయంలో ఎంతో ముందుంది.
ఈ విషయంలో మన భారతదేశ ప్రజలతో బయటి దేశస్థులు ఎఎవరూ పోటీ పడలేరనే చెప్పాలి.ఇక ఈ జుగాద్ విషయంలో ఎంతోమంది సామాన్యులు తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు.
ఇక ఇలాంటి వీడియోలు కూడా ఇంటర్నెట్ వలన ప్రపంచానికి చాలా త్వరగానే పరిచయమవుతున్నాయి.
ఇక ఇప్పుడు కొందరు పిల్లలు జుగాద్తో మ్యూజిక్ బ్యాండ్ తయారు చేసి వారు వాయించిన మ్యూజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోలో చిన్నారులు స్క్రాప్ ఐటెమ్‌లతో ఏకంగా మ్యూజిక్ బ్యాండ్‌ను క్రియేట్ చేసేచేశారు.దాంతో వారంతా ఒక రౌండ్‌గా నిల్చుని మధ్యలో ఒక పిల్లోడు నిల్చుని వారికి సూచనలు ఇస్తుంటే మిగతా పిల్లలు అంతా కూడా ఎంచక్కా ఆవో పిల్లలు మీకు చూపిస్తారు అనే ట్యూన్ ను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేలా వాయిస్తున్నారు.
ఇక ఇప్పుడు ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.