మహిళలపై – హింస నివారణ చర్యల అంతర్జాతీయ దినం సందర్బంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదిక అంతో ఇంతో మానవతా దృక్పధం వున్న ప్రతి ఒక్కరి హృదయాలను తీవ్రంగా గాయపరిచేలా వుంది.అదేమంటే ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఓక మహిళ అయిన వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోతుంది అనే చేదు నిజం యావత్ సమాజానికి ఓక చెంపపెట్టు వంటిది.
ఎందుకంటే ప్రపంచం లోని అనేక దేశాలు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నప్పటికి ఎందుకనో మహిళలకు మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో వారిపై జరుగుతున్న అత్యాచారాలను, హింసను అడ్డుకట్ట వేయడంలో దాదాపు అన్ని దేశాలు చాలా తీవ్ర స్థాయిలో విఫలం అవుతున్నాయి అనే మాట సత్యదూరం కాదు.ఐక్యరాజ్యసమితి సర్వోన్నత ప్రతినిధి ఆంటోనియా గుట్రెస్ కు అందిన నివేదిక ప్రకారం 2021 వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురి అయిన మహిళలు 81,000 మంది కాగా వీరిలో 56 శాతం మంది అంటే 45,000 మంది అయిన వారి (భర్త, తండ్రి, సోదరుడు, బంధువు, స్నేహితుడు ) చేతిలో అశువులు బాస్తుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
అంటే 2021 లో సహజ మరణం పొందే మహిళలు ఎలా వున్నా ప్రతి మందిలో నలుగురు కేవలం ఉద్దేశపూర్వకంగా చంపబడుతున్నట్లు గా గణాoకాలు తెలియజేస్తుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి ఓక మాయని మచ్చ వంటిది.అంతేగాకుండా మరో దిగ్బ్రాంతిగోలిపే విషయం ఏమంటే ప్రపంచంలో ప్రతి గంటకు ఐదుగురు మహిళలు ఇంట్లోని వాళ్ళ వల్లనే చంపబడుతుందటం అనేది యావత్తు మానవాళిని చాలా తీవ్రస్థాయిలో భయబ్రాంతులు కలిగించే విషయం.
ముఖ్యంగా ఈ మధ్యనే ఢిల్లీ లో సంభవించిన శ్రద్ధా వాకర్ హత్య ఇల్లు సంఘటన అనేది ఈ సమాజంలో మహిళల భద్రత ఎంతటి ప్రమాదకరమైన స్థాయికి చేరుకుందో చెప్పకనే చెబుతున్నది.ఇదివరకటి కాలంలో అయితే(నాడు )మహిళలు గడప దాటితే పదిలం కాదని మన పెద్దలు హితబోధ చేసేవారు.
అయితే నేడు మహిళలు వారి సొంత ఇంటిలో అభద్రతభావానికి గురవుతుండటం కడు శోచనీయం.
ఏదిఎమైన ఈ సమాజంలోని కొంతమంది మగ పుంగవులు మహిళలపై ఆధిపత్య ధోరణి కనబరుస్తూ వారు తమ సొంత ఆస్తి గా భావిస్తూ వారిపై హింసకు పాల్పడటం అనే అనాగరిక ధోరణి కొనసాగినంత కాలం ఇలా మహిళలు ఏదో రూపేణ వారి జీవితాల్లో నిత్య నరకం చూడాల్సిన దయనీయ పరిస్థితి కొనసాగుతూనే ఉండటం ఈ సమాజ హితం కోరే ప్రతి ఒక్కరూ ఏ మాత్రం జీర్ణించుకోలేని విషయం.
ఏమైనా మహిళలపై సొంతింటి వారి నుంచే ఎదురవుతున్న ఇలాంటి జూగుస్సకరమైన, దౌర్జన్యకరమైన, ఒళ్ళు జలదరించే ఘటనలకు పూర్తి స్థాయిలో చరమగీతం పాడాలంటే మాత్రం ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవతావాదులు, ఈ సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమించి ఏక త్రాటిపై నిలిచి ప్రతి ఒక్క మహిళలో అన్యాయాన్ని ఎదిరించే చైతన్యాన్ని, చట్టపరంగా వారికున్న హక్కులపై గళం విప్పే ధైర్య సాహసలను పెంపొందించేలా యుద్ధప్రాతిపదికన తీవ్ర కృషి చేయాల్సిన ఆవశ్యకత వారి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.

అలాగే మన న్యాయ స్థానాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రపంచంలో మహిళలపై నిత్యం జరిగుతున్న ఈ భరించలేని హింస విషయంలో ఏ మాత్రం ఉపేక్షించకుండా మహిళా భాదితుల పక్షాన నిలిచి అందుకు పాల్పడిన వారు ఎంతటి వారైనా,చివరకు సొంతింటి వారైనా వారి భరతం పట్టాల్సిన అవశ్యకత, వారిని చట్టపరంగా చాలా కఠినంగా శిక్షించాల్సిన తక్షణ కర్తవ్యం, గురుతర బాధ్యత వారిపై ఎంతైనా వుంది.ప్రపంచవ్యాప్తంగా మహిళల పై జరుగుతున్న హింస నశించాలి!మహిళలు తమపై జరుగుతున్న దుర్మార్గపు దొరణిని చాలా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైంది! మహిళ మేలుకో నీపై జరుగుతున్న హత్యకాండలను, దౌర్జన్య వైఖరిని క్రూక్కటివేళ్ళతో సహా పేకలించేందుకు నడుం బిగించు! అలస్యం అమృతం విషం అని మన పెద్దలు అంటారే అలా జరుగకుండా ప్రపంచంలోని ప్రతి మహిళ ఓ రాణిరుద్రమదేవి లా, ఝాన్సీ లక్ష్మీబాయ్ లా అనంత ధైర్య సాహసాలను అలవరచుకోని ఈ సమాజంలో వుంటూ మహిళలపై అనాగరిక ధోరణి అవలంబిస్తున్న కొంతమంది పురుష అవిచ్చిన్నకరమైన శక్తులను చాలా తీవ్ర స్థాయిలో చెయ్యి, చెయ్యి కలిపి ప్రతిఘటించాలి.జయ జయహో యావత్ మహిళ లోకం! దద్దరిల్లాలి దౌర్జన్యకర పురుష ప్రపంచం!
.