తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పికా గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా కల్పికా గణేష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈమె తెలుగులో ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు లాంటి సినిమాలలో చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవలే ఈమె హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అయితే మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను హీరోయిన్ల కంటే అందంగా ఉంటానని అందుకే తనని పక్కన పెట్టేస్తున్నారని అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
అందువల్లే తాను తక్కువ సినిమాలు చేశాను అని చెప్పుకొచ్చింది కల్పికా గణేష్.
అలాగే హీరోయిన్ సమంత లాగే తాను కూడా 13 ఏళ్లుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అంతేకాకుండా సమంత ప్రస్తుతం థర్డ్ స్టేజ్ లో ఉంది అన్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే యశోద సినిమా తర్వాత ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిస్తున్న కల్పికా గణేష్ తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది.అయితే యశోద సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు అందులో కీలకపాత్రలో నటించిన కల్పికా కి కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.లుంబార్ రాడిక్యులో పతి విజయవంతమైందని ఆమె తెలిపింది.ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో చూడాలి అని రాసుకొచ్చింది కల్పికా గణేష్.ప్రస్తుతం ఆమె రాడిక్యులర్ పెయిన్‌కు ఈ చికిత్స చేయించుకుంటోంది.
రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నెముక ద్వారా నొప్పి తొడలు, పాదాల వరకు ప్రయాణిస్తుంది.దీనివల్ల మనిషి ఎక్కువసేపు నిల్చోలేకపోవడంతోపాటు బలహీనంగా మారుతారు.
కాగా పదమూడేళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతున్న కల్పికా త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు.







