సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు తక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవుతుండటంతో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ అవుతాయో లేదో అని ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే.అయితే ఫ్యాన్స్ కు, థియేటర్ల ఓనర్లకు బెనిఫిట్ కలిగేలా ఒక నిర్ణయం అమలులోకి రానుందని సమాచారం.మైత్రీ నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
50 రూపాయల చొప్పున టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.టికెట్ కు 50 రూపాయలు అంటే తక్కువ మొత్తమే అనిపించినా కలెక్షన్ల పరంగా ఈ మొత్తం చాలా ఎక్కువ మొత్తం అవుతుందని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.అయితే టికెట్ రేట్లు పెంచుతున్నట్టు అధికారక ప్రకటన రానుంది.
ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా అంటే నిర్మాణ విలువలకు సంబంధించి ఏ మాత్రం రాజీ పడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సంక్రాంతికి రిలీజ్ కానున్న రెండు సినిమాలకు టికెట్ రేట్లు పెరుగుతాయా? లేక ఒక సినిమాకు మాత్రమే టికెట్ రేట్లు పెరగనున్నాయా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.ఈ రెండు సినిమాలకు భారీగానే ఖర్చైందనే సంగతి తెలిసిందే.
థియేటర్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను మైత్రీ నిర్మాతలు ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.ఒక్క సినిమానే రిలీజ్ చేసి ఉంటే మైత్రీ నిర్మాతలకు ఈ ఇబ్బంది ఎదురయ్యేది కాదు.ఆదిపురుష్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం ఆ సినిమాలకు ప్లస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి, బాలయ్య ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం.ఈ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.