ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత వాడివేడి వాతావరణం లో ఉన్నాయో మన అందరం చూస్తూనే ఉన్నాం.వైసీపీ పార్టీ పై( YCP ) జనాల్లో రోజు రోజుకి ఏర్పడుతున్న వ్యతిరేకత, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర దగ్గర నుండి, చంద్ర బాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ అవ్వడం, టీడీపీ మరియు జనసేన పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మారిన సమీకరణాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ కి ఘోర పరాభవం ఎదురు అవ్వక తప్పదని అంటున్నాయి సర్వేలు సైతం.
గత ఎన్నికలలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు కూడా ఈసారి గెలవడం కష్టం అని అంటున్నాయి సర్వేలు.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లో( Rayalaseema ) వచ్చే ఎన్నికలలో వైసీపీ కి 2014 లో ఎదురైనా పరిస్థితులే మళ్ళీ పునరావృత్తం అవ్వబోతుందని తెలుస్తుంది.
ఈ ప్రాంతం లో కూడా టీడీపీ – జనసేన జెండా పాతడం ఖాయం అని అంటున్నారు.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లోని చిత్తూరు జిల్లాలో( Chittoor ) టీడీపీ – జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయట.
ఈ జిల్లాలో రెండు పార్టీలకు బలమైన క్యాడర్ సపోర్టు ఉంది.అంతే కాకుండా ఇక్కడ టీడీపీ – జనసేన పార్టీ నాయకులూ మరియు కార్యకర్తల మధ్య సమన్వయం కూడా చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తుంది.
అందుకే ఇక్కడ పోటీ చేసే ప్రతీ స్థానం కూడా మంచి మెజారిటీ తో గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి.ఇక అనంతపురం జిల్లాలో( Anantapuram ) తెలుగు దేశం పార్టీ( TDP ) ఎంత స్ట్రాంగ్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.జనసేన పార్టీ కి( Janasena ) కూడా ఈ ప్రాంతం లో గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది.ఇక్కడ కూడా దాదాపుగా పొత్తు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కానీ కడప జిల్లాలో( Kadapa ) మాత్రం కేవలం ఒకటి రెండు స్థానాల్లో తప్ప టీడీపీ – జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు.
ఈ ప్రాంతం వైసీపీ కి కంచుకోట లాంటిది, కేవలం రైల్వే కోడూరు మరియు కడప సిటీ లలో టీడీపీ – జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇక కర్నూల్ మరియు నంద్యాల ప్రాంతాలలో టీడీపీ – జనసేన కూటములకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఓవరాల్ గా రాయలసీమ లో 53 స్థానాలు ఉంటే, అందులో 30 స్థానాల్లో టీడీపీ – జనసేన పార్టీలు గెలిచే అవకాశం ఉండగా, మిగిలిన 23 స్థానాల్లో వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని అంటున్నాయి లేటెస్ట్ సర్వేలు.