సైకిల్ పోవాలని స్వయంగా చంద్రబాబే పిలుపునిస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.చంద్రబాబుకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
అనంతరం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన మాట్లాడారు.తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, తప్పుకుంటానని సీఎం జగన్ కు చెప్పానన్నారు.
కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు.అయితే దీనిపై ఆలోచించేందుకు చాలా సమయం ఉందని పేర్కొన్నారు.
తనను గెలిపించిన ప్రజలు తలదించుకునే విధంగా ఎప్పుడూ వ్యవహరించనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.