అద్దె ఒప్పందం 11 నెల‌లే ఎందుకు ఉంటుందో తెలుసా?

అద్దె ఒప్పందం 11 నెలలు మాత్రమే ఎందుకు ఉంటుంద‌ని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒప్పుందం ఒక సంవత్సరం పాటు ఎందుకు ఉండ‌దు? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానం తెలుసుకుందాం.అద్దె ఒప్పందం అనేది యజమాని- అద్దెదారు మధ్య చేసుకున్న ఒక ఒప్పందం.

 Why Rent Agreement Duration Is 11 Month , Lease Agreement, Rent Agreement , 11 Months, Indian Registration,-TeluguStop.com

దీనిలో ఒక భూస్వామి తన ఆస్తిని ఎవరికైనా ఉండేందుకు లేదా ఏదైనా ఉపయోగం కోసం పరిమిత సమయం కోసం అద్దెకు ఇస్తున్నారు.ఇందుకోసం అద్దె నిర్ణయ‌మ‌వుతుంది.

ఈ ఒప్పందంలో అద్దెదారు- భూస్వామి మధ్య నిర్ణయ‌మైన‌ నిబంధనలు రాస్తారు.ఈ ఒప్పందం ద్వారా ఇద్దరూ కొన్ని షరతులపై అంగీకారం తెలియ‌జేస్తారు.

 Why Rent Agreement Duration Is 11 Month , Lease Agreement, Rent Agreement , 11 Months, Indian Registration, -అద్దె ఒప్పందం 11 నెల‌లే ఎందుకు ఉంటుందో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది కోర్టులో కూడా చెల్లుతుంది.అద్దెదారు, యజమాని లేదా బ్రోకర్.

అద్దె ఒప్పందాన్ని చేసుకున్నప్పుడల్లా ఆ ఒప్పందం 11 నెలలకు మాత్రమే ఉంటుంద‌ని మీకు తప్పక తెలిసే ఉంటుంది.ఇంతకీ ఈ కాంట్రాక్ట్ కేవలం 11 నెలలు మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా? భారతీయ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17లో దీనికి సంబంధించిన వివ‌రాలు ఉన్నాయి.రిజిస్ట్రేషన్ అవసరత‌, లీజు డీడ్ గురించి కూడా అందులో పేర్కొన్నారు.

అద్దె ఒప్పందాన్ని ఒక విధంగా లీజు దస్తావేజుగా పరిగణిస్తారు.

ఏదైనా లీజు దస్తావేజు ఒక సంవత్సరం పైబడి ఉంటే ఆ లీజు దస్తావేజు కూడా న‌మోదు చేయించుకోవాల్సి ఉంటుందని అందులో తెలిపారు.అద్దె ఒప్పందం ఒక‌ సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటే, అది నమోదు చేయవలసి ఉంటుంది.

దీని తరువాత ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అతను డ్యూటీ, స్టాంప్ ఖర్చులు మొదలైనవి చెల్లించాల్సివుంటుంది.అందుకే ఈ ఖర్చును నివారించడానికి, అద్దె ఒప్పందం 11 నెలలకు మాత్రమే ఉంటుంది.దీని తర్వాత ఇది పునరుద్ధరించబడుతుంది,.అయితే ఇది 12 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఉండే ఒప్పందం కాదు.

న్యాయ నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం యజమాని ఆస్తిపై ఏ కౌలుదారుకు ఎప్పుడూ హక్కు ఉండ‌దు.కానీ కొన్ని పరిస్థితులలో అద్దెకు నివసిస్తున్న వ్యక్తి ఈ విషయాన్ని ప్ర‌స్తావించ‌వ‌చ్చు.

ఆస్తి బదిలీ చట్టం ప్రకారం, ఈ విధంగా ఆస్తిని స్వాధీనం చేసుకున్న వ్యక్తి దానిని విక్రయించడానికి అర్హుడ‌వుతాడు.అంటే, ఎవరైనా 12 సంవత్సరాల పాటు ఆస్తిపై ప్రతికూల ఆధీనంలో ఉంచుకున్న‌ట్ల‌యితే అతను ఆస్తిపై హక్కును పొందుతాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube