సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద ఫ్యామిలీ హీరోలలో నందమూరి, మెగా ఫ్యామిలీ( Mega Family ) లు అలాగే అక్కినేని ఘట్టమేనేని,ఉప్పలపాటి ఫ్యామిలి లా నుంచే చాలా మంది హీరోలు ఇండస్ట్రీ లో ఉన్నారు.అయితే ఈ ఫ్యామిలీ లో ఉన్న హీరో లు అందరు కూడా వాళ్ళు చేసిన సినిమాలతో ప్రేక్షకులని ఎక్కువ గా ఆకట్టు కుంటారు.అయితే ఇండస్ట్రీ మొత్తం లో ఉన్న టాప్ హీరోలందరి లో స్టార్ హీరోలు అందరుకూడా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే ఉండటం నిజంగా విశేషం అనే చెప్పాలి…అయితే ఈ ఫ్యామిలీ తో పాటు మోహన్ బాబు( Mohan babu ) ఫ్యామిలీ అయినా మంచు ఫ్యామిలీ ఎందుకు ఆ స్థాయి కి ఎదగలేకపోయింది అంటే దానికి కారణం మోహన్ బాబా ఆటిట్యూడ్ అనే చాలా మంది సినీ మేధావులు చెప్తూ ఉంటారు…
మోహన్ బాబు కి ముఖ్యంగా తనకంటే అందరు ముందుకు పోతున్నారు అనే ఒక ఈర్ష్య, అసూయలు అయితే ఉంటాయి.అయన చాలా సార్లు స్టేజ్ మీద కూడా చిరంజీవి లాంటి వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడటం ఇవన్నీ కూడా చూస్తుంటే మనకు అర్థమవుతుంది…ఇక ఇదే కాకుండా ఓపెన్ గా స్టేజ్ మీదనే ఇండస్ట్రీ కి రెండు కళ్ళు గా చెప్పుకుంటున్న అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) లాంటి ఒక లేజడరీ నటుడిని పట్టుకొని నేను అయన కంటే గొప్ప నటుడిని అని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే మోహన్ బాబు కి ఇతరుల మీద ఎంత అసూయాతో ఉంటాడో మనకు క్లియర్ గా తెలిసిపోతుంది…తనే అందరికంటే గొప్పవాడిని అనే భావన కూడా తనలో చాలా ఉంటుంది ఇక తనతో పని చేసిన డైరెక్టర్లని ఓపెన్ గా తిట్టడం…ఇవన్నిటివల్లే మోహన్ బాబు ఇండస్ట్రీ లో పెద్దగా ఎదగలేకపోయాడు…
నిజానికి మోహన్ బాబు మంచి నటుడే కానీ ఇతరుల పట్ల రెస్పెక్ట్ గా ఎలా ఉండాలి అనేది మాత్రం ఆయన మాటల్లో మనకు ఎప్పుడు కనిపించదు.ఎవరిని అయినా సరే స్టేజ్ మీద డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతాడు…అందుకే ఆయన గాని, ఆయన కొడుకులు గాని ఇండస్ట్రీ లో పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు.అందుకే పెద్ద దర్శకులు కూడా వాళ్ళతో సినిమాలు చేయడం లేదు…