ఏలూరు జిల్లా పెదవేగి నవోదయ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..!!

ఏలూరు జిల్లా( Eluru ) పెదవేగి మండలం నవోదయ పాఠశాలలో( Navodaya School ) ఫుడ్ పాయిజన్ అయింది.భోజనం తిన్న తర్వాత శుక్రవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

 Food Poisoning In Pedavegi Navodaya School Details, Eluru District Food Poisonin-TeluguStop.com

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.వెంటనే ఆ ఇద్దరిని ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న డిఎంహెచ్ఓ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడం జరిగింది.ఇదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు డిఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.అయితే విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.ఇదిలా ఉంటే జిల్లా వైద్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి( Mla Abbaiah Choudary ) పరామర్శించడం జరిగింది.బాధితులకు అందుతున్న సహాయాన్ని తెలుసుకొని.

ఫుడ్ పాయిజన్( Food Poison ) ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం.ఇదిలావుండగా ఇద్దరు విద్యార్థులు మినహా మిగతా వారిని నవోదయ పాఠశాల ప్రాంగణంలో తరగతి గదులలో చికిత్స అందిస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube