ఏలూరు జిల్లా పెదవేగి నవోదయ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..!!
TeluguStop.com
ఏలూరు జిల్లా( Eluru ) పెదవేగి మండలం నవోదయ పాఠశాలలో( Navodaya School ) ఫుడ్ పాయిజన్ అయింది.
భోజనం తిన్న తర్వాత శుక్రవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
వెంటనే ఆ ఇద్దరిని ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న డిఎంహెచ్ఓ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడం జరిగింది.
ఇదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు డిఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.అయితే విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
ఇదిలా ఉంటే జిల్లా వైద్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి( Mla Abbaiah Choudary ) పరామర్శించడం జరిగింది.
బాధితులకు అందుతున్న సహాయాన్ని తెలుసుకొని.ఫుడ్ పాయిజన్( Food Poison ) ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం.
ఇదిలావుండగా ఇద్దరు విద్యార్థులు మినహా మిగతా వారిని నవోదయ పాఠశాల ప్రాంగణంలో తరగతి గదులలో చికిత్స అందిస్తూ ఉన్నారు.
విజయ్ దేవరకొండ మూవీలో బాలయ్య.. ఆ సినిమాతో బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!