సినిమా ఇండస్ట్రీ లో ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు.ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్ లో ఉంటారు ఇవాళ్ల చిన్న సినిమాలు చేసే వల్లే రేపు ఒక పెద్ద ప్రాజెక్టు చేయచ్చు,ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తున్న వాళ్ళు అనుకోకుండా చిన్న ప్రాజెక్టు చేయచ్చు…అందుకే ఇండస్ట్రీ లో అందరు చాలా జాగ్రత్త గా ఉండాలి అని చెప్తారు…ఇక అలాంటి సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది ఉన్న ఎవరు లేకపోయినా సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ముందు వెళ్తూనే ఉంటుంది…ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఇద్దరు యంగ్ హీరోలు కెరియర్ మొదట్లో సూపర్ హిట్లు తీసి మళ్లీ ఇప్పుడు వేరే వాళ్ళ సినిమాల్లో సైడ్ ఆర్టిస్టులు గా చేస్తున్నారు.అలాంటి వాళ్లలో మనం చెప్పుకునే మొదటి హీరో వరుణ్ సందేశ్( Varun sandesh )…
ఈయన హ్యాపీ డేస్ అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.ఆ సినిమా భారీ విజయం సాధించడం తో ఇండస్ట్రీ లోనే చాలా సినిమాలు చేస్తూ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈయన హ్యాపీ డేస్ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.అలాగే ఆ తరువాత ఏమైంది ఈవేళ సినిమాతో మంచి హిట్ అయితే దక్కింది అయినా కూడా ఈయన తరువాత చేసిన కొన్ని సినిమాల కారణంగా మళ్లీ హీరో గా అవకాశాలు లేకుండా చేసుకున్నాడు ఇప్పుడు సందీప్ కిషన్ లాంటి హీరో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు…
ఇక ఈ కోవలోకే వచ్చే మరో హీరో ప్రిన్స్( Prince ) ఈయన చేసిన మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత మారుతీ డైరెక్షన్ లో చేసిన బస్స్టాప్ సినిమా( Bus stop )లతో హీరో గా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఈయన స్టోరీ సెలక్షన్ లో చేసిన మిస్టేక్స్ వల్లే హీరో గా ఫెడ్ అవుట్ అయిపోయాడు.దాంతో ఇప్పుడు డీజే టిల్లు లాంటి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసాడు…