తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో బాలయ్య( Balakrishna ) బాబు ఒకరు.చాలా రోజుల నుంచి బాలయ్య బాబు వాళ్ల అబ్బాయి అయిన మోక్షజ్ఞ ( Mokshagna Teja )సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నాడు అనే దానిమీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఈ క్రమంలోనే మోక్షజ్ఞ కి సంబంధించిన సినిమా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా బాలయ్య బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆదిత్య 369 సినిమాకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేసుకొని ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ మాత్రం 2024లో ఎట్టి పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఆదిత్య 369 సినిమా కి సిక్వేల్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేదానిమీద ఇప్పటికే చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.అయితే ఈ సినిమా ని కొత్త డైరెక్టర్ తో చేయాలని బాలయ్య బాబు అనుకుంటున్నారని తెలుస్తుంది.ఇక అదే సిచువేషన్ లో ఈ సినిమాకి మొదటి పార్ట్ ని తెరకెక్కించిన సింగీత శ్రీనివాసరావు మళ్ళీ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తాడనే మాటలు కూడా వస్తున్నాయి.
కానీ సింగితం శ్రీనివాసరావు( Singeetam Srinivasa Rao ) ప్రస్తుతానికి వయోభారంతో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆయన కాకుండా యంగ్ డైరెక్టర్ ని పెట్టి ఈ సినిమా తీయాలని బాలయ్య బాబు చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా కనక స్టార్ట్ అయి రిలీజ్ అయిన తర్వాత బోయపాటి కూడా మోక్షజ్ఞ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ ఇయర్ మోక్షజ్ఞ సినిమాలు చేయడానికి బాలయ్య బాబు ముందు నుంచే మంచి ప్లానింగ్ లో వెళ్తున్నాడు ఇక మోక్షజ్ఞ మొదటి సినిమాతో సక్సెస్ కొడతారా లేదా అనే విషయాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…
.