తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం చేసింది తక్కువ సినిమాలే అయిన చాలా రోజుల పాటు గుర్తుండి పోతారు అలాంటి వాళ్లలో అంజలి( Anjali ) ఒకరు…జర్నీ సినిమాతో తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా నటించి అందరిని ఆకట్టుకొని తెలుగు వారికి చేరువయింది. గీతాంజలి( Gitanjali ) సినిమాలో డబుల్ రోల్ చేసి మెప్పించింది తెలుగు బ్యూటీ అయిన అంజలి వరుస సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సాధించింది.
తెలుగు అమ్మాయి అయినా.తమిళంలో బాగా క్లిక్ అయ్యింది .అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది .అయితే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కు మాత్రం కాస్త దూరంలోనే ఆగిపోయింది.ఇక అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తూ.తెలుగువారి మనసును కూడా దోచేసింది ప్రస్తుతం సీనియర్ హీరోలకు జతగా నటిస్తూ.కెరీర్ లో పర్వాలేదు అనిపించుకుంటుంది.ఇక తమిళ సినిమాల్లో పాపులర్ అయిన టైమ్ లోనే.
యంగ్ హీరో తో లవ్ ట్రాక్ నడిపింది .వీరిద్దరు కలిసి లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారని వార్తలు రావడంతో.అంజలి ఫిల్మ్ కెరీర్ పై ఆ ప్రభావం గట్టిగా పడింది.అంజలికి అవకాశాలు తగ్గాయి.ఇద్దరు స్టార్లు పెళ్ళి చేసుకుంటారు అనికూడా అనుకున్నారు.
అయితే కొన్నాళ్ళకు వీరి ప్రేమ బ్రేకప్ అయ్యింది.అప్పటి నుంచి కెరీర్ పై కాంన్సంట్రేట్ చేసింది అంజలి.ప్రస్తుతం కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అంజలి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందని టాక్ .అంతే కాదు ఆమె చేసుకోబోయేది ఇండస్ట్రీకి సబంధించి వ్యక్తిని కాదని అంటున్నారు .అంజలి తన పెళ్ళిబాధ్యతలను పూర్తిగా తల్లీ తండ్రులకు అప్పగించేసినట్టు తెలుస్తోంది.ఇక అంజలి తల్లిదండ్రులు కూడా ఆమెకు ఓ మంచి కుర్రాడిని చూసినట్లుగా తెలుస్తోంది.అబ్బాయి కూడా అచ్చ తెలుగు అబ్బాయి అని సమాచారం.
హీరోయిన్ అంజలి తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటారు.కానీ, తమ కూతురి కోసం చెన్నైలో ( Chennai )ఉంటున్న ఓ తెలుగు కుటుంబానికి చెందిన, తెలుగు కుర్రాడిని చూశారని.
త్వరలోనే వారు ఇండియాకు వచ్చి.పెళ్ళి పనులు స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ ఏడాది చివరి వరకూ అంజలి పెళ్ళి జరిగే అవకాశం ఉంది.అంజలి ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తుంది.
ఈ సినిమా తరువాతే అంజలి పెళ్లి జరగబోతుందని టాక్ ప్రస్తుతం ఈ వార్త తమిళ….ఫిల్మ్ సర్కిల్ లో షికారు చేస్తోంది.
సౌత్ ఇండస్ట్రీలో.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ మధ్య తను ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు బహుశా పెళ్లి టాపిక్ వల్లే సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది…
.